Nara Lokesh : నవ్యాంధ్రకు నిధుల కోసం లోకేశ్‌ పరుగులు.. ఇటు ప్రభుత్వం.. అటు పార్టీలో చిన్నబాబు మార్క్‌.!

Nara Lokesh : లోకేశ్‌, పీకే భేటీ వెనుక ఏదో వ్యూహం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. రాబోయే రోజుల్లో పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ను బట్టి..పీకేతో లోకేశ్‌ భేటీ సారాంశమేంటో క్లారిటీ రానుంది. 

Nara Lokesh : నవ్యాంధ్రకు నిధుల కోసం లోకేశ్‌ పరుగులు.. ఇటు ప్రభుత్వం.. అటు పార్టీలో చిన్నబాబు మార్క్‌.!

AP Minister Nara Lokesh Meets Prashant Kishor in Delhi

Updated On : February 5, 2025 / 9:03 PM IST

Nara Lokesh : టీడీపీ ఫ్యూచర్ లీడర్ చిన్నబాబే.. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. అందుకే సొంత పార్టీ నేతలు డెప్యూటీ సీఎం అని, సీఎం అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. బీజేపీ పెద్దలు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. అయినా లోకేష్ ఎక్కడ హడావిడి చేయట్లేదు.

ఇది ప్రభుత్వంలో అటు పార్టీ పరంగా తన అవసరం ఉన్న దగ్గర అన్ని తానే చూసుకుంటూ హంగామా లేకుండా పనిచేసుకుంటూ పోతున్నారు. నిధుల కోసం కేంద్ర పెద్దలు కలిసే విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా పీకేతో భేటీ పాలిటెక్నిక్ మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చారు. ఇంతకీ, లోకేష్ వ్యూహం ఏంటి? హడావిడి హంగామా లేకుండా పనికానిచ్చేయడంపై వెనక ప్లాన్ ఉందా?

Read Also : Home Buyers Guide : మీరు ఫస్ట్ టైం ఇల్లు కొనబోతున్నారా? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి.. మీరెప్పటికీ బాధపడరు..!

ఏపీ అభివృద్ధి, తెలుగు స్టేట్స్‌ పాలిటిక్స్‌పై ఫోకస్ :
మంగళగిరి ఎమ్మెల్యే. ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రి. అక్కడి వరకే పరిమితం కావడం లేదు మినిస్టర్ నారా లోకేశ్. అలా అని మిగతా మంత్రుల శాఖల్లో వేలు పెట్టడం లేదు. డామినేషన్‌ చూపించట్లేదు. హడావుడి, హంగామా అసలే లేదు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో వరుస పెట్టి కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు.

ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి.. డిఫెన్స్ పరికరాల తయారీ యూనిట్లు నవ్యాంధ్రకు వచ్చేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయి విద్యారంగంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం, న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీపై డిస్కస్ చేశారు.

నిధులు, పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నారు లోకేశ్. బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు వారసుడిగా, ఏపీ మంత్రిగా లోకేశ్‌ మంచి ప్రయారిటీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేశ్‌తో సెపరేటుగా మాట్లాడారు.

కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయినా ఇప్పటివరకు తనను ఎందుకు ప్రత్యేకంగా కలువలేదని అడిగారు. ఫ్యామిలీతో ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ కూడా సూచించారు. ఇలా ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో లోకేశ్‌ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశం అవుతోంది. అంతే కాదు హస్తిన టూర్‌లో లోకేశ్‌ ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ అయ్యారన్న టాక్‌ పొలిటికల్‌ డిస్కషన్ పాయింట్ అయింది.

పీకేతో రెండు గంటల పాటు భేటీ :
ఢిల్లీలోని సీఎం చంద్రబాబు అధికార నివాసంలో ప్రశాంత్ కిశోర్‌, లోకేశ్‌ భేటీ రెండు గంటల పాటు సాగిందని చెబుతున్నారు. ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నారని అంటున్నారు. ఏపీలో ఎనిమిది నెలల కూటమి పాలనపై పబ్లిక్‌ టాక్ ఎలా ఉందో ఆరా తీశారట లోకేశ్‌. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండటంపైనా చర్చ జరిగిందట. ఏపీలో కూటమి ప్రభుత్వం జనంలోకి మరింతగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోకేశ్‌కు కొన్ని సూచనలు చేశారట పీకే. టీడీపీ తన అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలన్నా వైసీపీ పుంజుకోకుండా ఎలాంటి స్ట్రాటజీపై పీకే సజెషన్స్ ఇచ్చారట. తన ఐడియాస్‌ను లోకేశ్‌తో షేర్‌ చేసుకున్నారట ప్రశాంత్ కిశోర్.

పీకేతో భేటీ.. తెలంగాణలో టీడీపీ ఫ్యూచర్‌పై డిస్కస్ :
లోకేశ్‌, పీకే భేటీలో తెలంగాణ పాలిటిక్స్‌ మీద కూడా డిస్కషన్‌ జరిగినట్లు టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ స్కోప్‌ ఉందా..ఏయే జిల్లాల్లో టీడీపీకి పట్టుందనే అంశాలపై ఆరా తీశారట లోకేశ్. రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్‌లో కింగ్‌ మేకర్‌గా ఉండాలని భావిస్తున్న టీడీపీ త్వరలోనే యాక్టివిటీని స్పీడ్ చేయాలనుకుంటుంది. రాబోయే GHMC ఎన్నికల్లో పోటీకి కూడా సైకిల్ పార్టీ ఆసక్తికగా ఉందట. అందులో భాగంగానే పీకేతో భేటీలో తెలంగాణ రాజకీయాలపై ఆరా తీశారట లోకేశ్.

టీడీపీకి గత ఎన్నికల ముందు ముఖ్య సలహదారుడిగా పీకే వ్యవహరించారు. జగన్‌ డబ్బులు ఇచ్చినంత మాత్రానా తిరిగి అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమే అని కూడా చెప్పారు. అంతేకాదు జగన్‌ ఘోర ఓటమి పాలు కాబోతున్నారని..టీడీపీ చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకోబోతోందని ముందుగా చెప్పింది కూడా పీకేనే. అప్పటివరకు జగన్‌కు సలహాదారుగా ఉన్న పీకే..ఆ తర్వాత పూర్తిగా టీడీపీకి టచ్‌లోకి వెళ్లిపోయారు.

Read Also : KTR : తెలంగాణలో ‘కులగణన’పై పార్లమెంట్‌నే తప్పుదోవ పట్టిస్తారా? రాహుల్ గాంధీపై కేటీఆర్ ఆగ్రహం.. భారీ లేఖ

లోకేశ్‌, పీకే భేటీ వెనుక వ్యూహం ఏంటి? :
తరచు అమరావతికి వచ్చి చంద్రబాబు, లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిందే నిజం అయింది కూడా. దాంతో టీడీపీతో పీకే సంబంధాలు మరింత బలపడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పీకేతో ప్రత్యేకంగా భేటీ అయి ముచ్చటించారు లోకేశ్. ఏపీలో కూటమి సర్కార్ పాలన, పబ్లిక్ ఓపీనియన్‌పై ఆరా తీయడంతో పాటు తెలంగాణ పాలిటిక్స్‌పై కూడా డిస్కస్ చేశారన్న టాక్‌.. పొలిటికల్ హాట్ టాపిక్‌ అవుతోంది. అయితే లోకేశ్‌, పీకే భేటీ వెనుక ఏదో వ్యూహం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. రాబోయే రోజుల్లో పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ను బట్టి..పీకేతో లోకేశ్‌ భేటీ సారాంశమేంటో క్లారిటీ రానుంది.