Home Buyers Guide : మీరు ఫస్ట్ టైం ఇల్లు కొనబోతున్నారా? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి.. మీరెప్పటికీ బాధపడరు..!
Home Buyers Guide : మీరు లోన్ మీద ఇల్లు కొనాలనుకుంటే.. మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి. బ్యాంక్ మీకు కొనే ఇంటి ధరలో 90 శాతం రుణాన్ని ఇస్తుంది. ముందుగానే ఎక్కువగా డౌన్ పేమెంట్ చేయాలి.

Buyin Home for First Time
Home Buyers Guide : ప్రతిఒక్కరికి ఇల్లు అనేది ఒక కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు అనేక కష్టాలను పడుతుంటారు. ఎంత అప్పు చేసేందుకు అయినా వెనుకడారు. ముఖ్యంగా, మీరు మీ కుటుంబం కోసం మొదటిసారి ఇల్లు కొనుగోలు చేయడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతిగా చెప్పవచ్చు. మొదటిసారి ఇల్లు కొనబోయే వ్యక్తులు అనేక ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మీరు కూడా మొదటిసారి ఇల్లు కొనబోతున్నారా? ఫ్లాట్ లేదా ఇల్లు కొనబోతున్నట్లయితే లేదా కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీకోసం కొన్ని ముఖ్యమైన విషయాలను అందిస్తున్నాం. ఈ టిప్స్ దృష్టిలో ఉంచుకుని మీరు ఇల్లు కొంటే.. కచ్చితంగా మీ సమస్యలు చాలావరకూ తగ్గుతాయి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అవేంటో ఓసారి లుక్కేయండి.
గృహ రుణం :
మీరు లోన్ మీద ఇల్లు కొనబోతున్నట్లయితే.. మీ క్రెడిట్ స్కోర్ బాగుందా చెక్ చేసుకోండి. ఎందుకంటే.. బ్యాంక్ మీకు ఆస్తి ధరలో 90 శాతం రుణం ఇవ్వగలదు. కానీ, ఇక్కడ మీరు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. గరిష్టంగా డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా, మీ జేబుపై అధిక, దీర్ఘకాలిక ఈఎంఐల భారం పడదు. గృహ రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు, (NBFC)లను సంప్రదించి, మీకు అత్యంత చౌకైన రుణం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోండి.
జీతం :
గృహ రుణం తీసుకునేటప్పుడు, మీ జీతంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. రాబోయే సంవత్సరాల్లో మీ జీతం ఎంత పెరుగుతుందో కూడా ఆలోచించండి. దాంతో పాటు, ఇంటి ఖర్చులన్నింటినీ మీ జీతం నుంచే భరించాలని గుర్తుంచుకోండి.
Read Also : Vijay Mallya : బ్యాంకులను సవాల్ చేస్తూ హైకోర్టుకు విజయ్ మాల్యా.. రుణ రికవరీపై నోటీసులు.. అసలేం జరిగిందంటే?
అవసరమైన ఖర్చులు :
గృహ రుణం తీసుకునే ముందు మీ ఖర్చులెన్నో లెక్కించాలి. అందులో ఏ ఖర్చు తగ్గించాలి లేదా ఇప్పుడు ఆపేయాలి అనేది నిర్ధారించుకోవాలి. వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. తద్వారా భవిష్యత్తులో ఈఎంఐ చెల్లించడంలో ఎలాంటి సమస్య ఉండదు.
ఇంటి ధర :
ఇల్లు అనేది పదే పదే కొనలేని ఆస్తి. కాబట్టి, డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీరు ఇప్పటికే ఖరీదైన ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే అది పర్వాలేదు. లేకపోతే, మీరు చౌకైన ఇంటిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఆ తరువాత తక్కువ ఖర్చుతో అవసరమైన రిపేర్లు చేయవచ్చు.