Andhra Pradesh : నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. Andhra Pradesh

Andhra Pradesh : నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

Andhra Pradesh - Jobs(Photo : Google)

Updated On : August 3, 2023 / 10:43 PM IST

Andhra Pradesh – Govt Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని పోస్టుల భర్తీకి సీఎం జగన్ (CM Jagan) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చారు. 3 వేల 295 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేశారు. వీటిని ఏపీపీఎస్సీ(APPSC) ద్వారా భర్తీ చేయనున్నారు. 2వేల 635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Post Office Recruitment : తపాలా శాఖలో పదో తరగతి అర్హతతో ఉద్యోగ ఖాళీల భర్తీ

ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉండగా.. వీటిలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల కొలువులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య ఉండాలంటే పూర్తిస్థాయిలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ చెప్పారు.

Government Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ పాస్ అయితే చాలు ప్రభుత్వ ఉద్యోగం