AP Covid Update : ఏపీలో కొత్తగా 163 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 163 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
- chvmurthy
- Published On : December 15, 2021 / 06:30 PM IST
Ap Covid Update
AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 163 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 162 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,821 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,271 కి చేరింది. వీరిలో 20,58,979 కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో గత 24 గంటల్లో ముగ్గురు మరణించారు. వీరు నెల్లూరు,శ్రీకాకుళం,విశాఖ జిల్లాలకు చెందిన వారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,471కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 3,08,62,705మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read : YSRCP MP’s Press Meet : ఏపీని కాదని పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు-వైసీపీ ఎంపీల సూటి ప్రశ్న
