YSRCP MP’s Press Meet : ఏపీని కాదని పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు-వైసీపీ ఎంపీల సూటి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వని కేంద్ర ప్రభుత్వం పాండిచ్చేరి ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా చెపుతోందిన వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు.

YSRCP MP’s Press Meet : ఏపీని కాదని పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు-వైసీపీ ఎంపీల సూటి ప్రశ్న

Ysrcp Mps

YSRCP MP’s Press Meet :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వని కేంద్ర ప్రభుత్వం పాండిచ్చేరి ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా చెపుతోందిన వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈరోజు వారు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… 14వ ఆర్థిక సంఘం వద్దంటోంది అంటూ ఏపీకి నిరాకరించి, పాండిచ్ఛేరికి ఎలా ఇస్తారు? అని తాలారి రంగయ్య ప్రశ్నించారు. పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రాష్ట్రానికి ఇస్తున్నట్టు బీజేపీ పేర్కందని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇవ్వదల్చుకుంటే ఇవ్వొచ్చని 15వ ఆర్థిక సంఘం చెబుతోందని ఆయన చెబుతూ…. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అంగీకరించాయని…అలాంటి చట్టంలో పొందుపర్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తలారి రంగయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

నవంబర్ 19న సంభవించిన తుఫాన్ వల్ల ఏపీలో నాలుగు జిల్లాల పై తీవ్ర ప్రభావం చూపిందని…2 లక్షల మంది ప్రజలు వరదల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నారని ఆదాల ప్రభాకర రెడ్డి చెప్పారు. తుఫాను కారణంగా రూ. 6 వేల కోట్ల నష్టం జరిగినట్టు అంచనా వేశారని… తక్షణ వరద సహాయంగా వెయ్యి కోట్లు ఇవ్వలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసారని త్వరగా నిధులు విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం బాగా పనిచేస్తోందని జస్టిస్ చంద్రు చెప్పడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడ్డారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ చంద్రు దేశంలోనే పేరొందిన ప్రఖ్యాత రిటైర్డ్ న్యాయమూర్తి అని… చేతికి అందిన కూడును, నోటికి అందకుండా కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా, ఏ అభివృద్ది కార్యక్రమం తలపెట్టినా చంద్రబాబు పాడుచేసే ప్రయత్నం చేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న చంద్రబాబు ప్రశ్నించవచ్చు, కానీ ఒక విశ్రాంత న్యాయమూర్తి మాట్లాడే హక్కును చంద్రబాబు ఎలా ప్రశ్నిస్తారని మాధవ్ అన్నారు.

Also Read : Hash Oil Sales Gang : హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్-5.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం

ఉత్తరాంధ్ర లో కేంద్ర ఏర్పాటు చేసే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని సాలూరులోఏర్పాటు చేయాలని గొడ్డేటి మాధవి కేంద్రాన్ని కోరారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపిందని సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో 556 ఎకరాల స్థలాన్ని కూడా కేంద్రానికి చూపించాం అని అక్కడే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మాధవి కోరారు.