TDP Candidates second List : టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల.. 22మందిలో 18 మంది మహిళా అభ్యర్థులు
TDP Candidates second List : ఏపీలో కార్పొరేషన్ మున్సిపల్, నగర పంచాయతీల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ రెండో జాబితాను విడుదల చేసింది.
TDP Candidates second List
TDP Candidates second List : ఏపీలో కార్పొరేషన్ మున్సిపల్, నగర పంచాయతీల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ శనివారం మధ్యాహ్నం 22 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో మచిలీపట్నం మేయర్ అభ్యర్థితో పాటు 21 మునిసిపల్ చైర్ పర్సన్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
♦ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదాను టీడీపీ అధిష్టానం ప్రకటించింది.

రెండో లిస్టులోని 22 మందిలో 18 మంది (82శాతం) మహిళా అభ్యర్థుల ఉన్నారు. అయితే, 22 మందిలో 16మంది (73శాతం) బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఆరుగురు బీసీ, ఐదుగురు ఎస్సీ, ఐదుగురు మైనార్టీ వర్గానికి చెందిన నేతలకు టికెట్లు దక్కాయి.
తాజాగా.. రెండో లిస్టులో మచిలీపట్నం, నాయుడుపేట, నందికొట్కూరు, కదిరి, ఆకివీడు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను ప్రకటించారు. అయితే, వీరిలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ 11 కార్పొరేషన్, 78 మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడత జాబితాలో ఏడు మేయర్ స్థానాలకు, 29 చైర్ పర్సన్ స్థానాలకు ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ఒక కార్పొరేషన్ స్థానంకు, 21 మున్సిపాలిటీలకు చైర్ పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది. రెండు జాబితాలు కలిపి తెలుగుదేశం నుంచి ఎనిమిది కార్పొరేషన్, 50 మున్సిపల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అంటే రెండు విడుతల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు టీడీపీ అధిష్టానం ప్రకటించింది.
రెండు జాబితాల్లో కలిపి అభ్యర్థులను ప్రకటించిన 58స్థానాల్లో బీసీ 22, ఓసి 20, ఎస్సీ 8, మైనారిటీ 7, ఎస్టీ సామాజిక వర్గంకు చెందిన ఒకరు ఉన్నారు. వీరిలో 38మంది గ్రాడ్యుయేట్లు, అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. 58 మందిలో 37 మంది (64శాతం) మహిళా అభ్యర్థులు ఉండగా.. 58మందిలో 38మంది (66శాతం) బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల వారు ఉన్నారు.
