Ap Unemployments Milk Anointing To Ts Cm Kcr Flexi
ap unemployments milk anointing to TS cm kcr flexi : తెలంగాణ CM కేసీఆర్ చిత్రపటానికి ఏపీవాసులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ఉద్యోగ మేళాను ప్రకటించి శుభవార్త చెప్పారు. మా పరిస్థితి ఏంటీ? కేసీఆర్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుండు అన్నట్లుగా ఏపీలోని విశాఖపట్నంలో నిరుద్యోగ ఐక్య కార్యచరణ సమితి ప్రతినిధులు విశాఖలో క్షీరాభిషేకం తెలంగాణ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేశారు.
Also read : Telangana : రాష్ట్రంలో 91,142 ఉద్యోగ పోస్టులు భర్తీ.. జిల్లాల వారిగా వివరాలు
ఈరోజు (మార్చి 9,2022) తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 91వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న కేసీఆర్ ప్రకటించారు. ఈ ఉద్యోగ భర్తీలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఈరోజే జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో కేసీఆర్ కు తెలంగాణ నిరుద్యోగులనుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ నిరుద్యోగులు కూడా తెలంగాణ సీఎంక పాలాభిషేకం చేయటం విశేషం. ఏపీ నిరుద్యోగులు తమకు ఎప్పుడు అటువంటి అవకాశం వస్తుందోనని ఎంతో ఆకాంక్షతతో ఎదురు చూస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం పట్ల తమ నిరసనను తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వ్యక్తం చేశారు.
Also read : Telangana Jobs : తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు.. నిరుద్యోగులు ఫుల్ ఖుష్
ఈ సందర్భంగా ఏపీ నిరుద్యోగులు ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Also read : Telangana Jobs : క్యాడర్, జోన్, మల్టీ జోన్లవారీగా పోస్టుల వివరాలు
వీటితో పాటు 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. ఇకనుంచి తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరు అని కేసీఆర్ వెల్లడించారు.