Telangana Jobs : తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు.. నిరుద్యోగులు ఫుల్ ఖుష్

నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఫొటోలు, కటౌట్ లకు పాలాభిషేకం చేస్తున్నారు.

Telangana Jobs : తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు.. నిరుద్యోగులు ఫుల్ ఖుష్

Telangana Jobs

Telangana Chief Minister : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 91 వేల 142 ఉద్యోగాలను పోస్టులను భర్తీ చేయనుంది. అంతేగాకుడా 11 వేల 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఈ కీలక ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఫొటోలు, కటౌట్ లకు పాలాభిషేకం చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. తెలంగాణ భవన్ లో సంబరాలు మిన్నంటాయి. సీట్లు పంచుకుని.. సంబరాలు చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఓయూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని ఓయూ జేఏసీ సంబరాలు జరుపుకున్నారు. దేశమంతా మరోసారి తెలంగాణ వైపు తొంగి చూస్తోందని, 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషకరమని జేఏసీ నేతలు వెల్లడించారు. 95 శాతం లోకల్ రిజర్వేషన్ ఇవ్వడం హర్షణీయమన్నారు.

Read More : Telangana Jobs : క్యాడర్, జోన్, మల్టీ జోన్లవారీగా పోస్టుల వివరాలు

ఇక ఉద్యోగాల విషయానికి వస్తే… ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు గత కొన్ని రోజులుగా వేచి చూస్తున్నారు. ఉద్యోగ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రతిపక్షాలు సైతం ఆందోళనలు, నిరనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2022, మార్చి 09వ తేదీ బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగాయి. 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. తాను నిరుద్యోగుల విషయంలో అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నట్లు, నిరుద్యోగు సోదరులంతా ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని వనపర్తి జిల్లాలో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీంతో ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.

Read More : Telangana : రాష్ట్రంలో 91,142 ఉద్యోగ పోస్టులు భర్తీ.. జిల్లాల వారిగా వివరాలు

అనుకున్నట్లుగానే… నిరుద్యోగులు సెల్ ఫోన్, టీవీల ముందు అతుక్కపోయారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 91,142 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై సర్కార్ లెక్కలు తీసింది. దీనికి అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలని అంశంపై కసరత్తు కూడా పూర్తి చేసింది. కొత్తగా ఉద్యోగాల భర్తీ చేస్తే జీతభత్యాల కోసం ఈ బడ్జెట్ లో సుమారు 4 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. నిర్ణీత గడువు కంటే ముందుగానే ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇప్పుడు మొదలు పెడితే ఉద్యోగాలు భర్తీ అయ్యే వరకు కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంటుందని సర్కార్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More : CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగ పోస్టుల భర్తీ, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్

ఉద్యోగాల భర్తీని దృష్టిలో ఉంచుకొని వెనుకబడిన వర్గాల అభ్యర్థుల కోసం మరోసారి పదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం ఇటీవల పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినా…..బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కి ప్రత్యేకంగా కేటాయింపులు జరుపలేదు.ఈ కారణంగా నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. దీనిపై విధానాలు మాత్రం ఖరారు చేసేందుకు ఓ కమిటీని నియమించే ఛాన్స్ కనిపిస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నిరుద్యోగులకు చెప్పబోయే తీపి కబురు పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమౌతోంది.