Telangana : రాష్ట్రంలో 91,142 ఉద్యోగ పోస్టులు భర్తీ.. జిల్లాల వారిగా వివరాలు

పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Telangana : రాష్ట్రంలో 91,142 ఉద్యోగ పోస్టులు భర్తీ.. జిల్లాల వారిగా వివరాలు

Jobs

District wise details of posts : ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటి భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్ ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. అలాగే 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పారు. 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు.

పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో 39, 829 ఉద్యోగ ఖాళీలు, జోనల్ స్థాయిలో 18,866 ఉద్యోగ ఖాళీలు, మల్టీ జోన్ లో 13,170 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగ పోస్టుల భర్తీ, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్

ఇతర కేటగిరిచ, వర్సిటీల్లో 8,174 పోస్టులు, గ్రూప్1-503, గ్రూప్ 2-582 పోస్టులు, గ్రూప్3 -1373 పోస్టులు, గ్రూప్ 4-9168 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Sl. No జిల్లా నేరుగా భర్తీ అయ్యే పోస్టులు
1 హైదరాబాద్ 5,268
2 నిజామాబాద్ 1,976
3 మేడ్చల్-మల్కాజిగిరి 1,769
4 రంగారెడ్డి 1,561
5 కరీంనగర్ 1,465
6 నల్లగొండ 1,398
7 కామారెడ్డి 1,340
8 ఖమ్మం 1,340
9 భద్రాద్రి-కొత్తగూడెం 1,316
10 నాగర్ కర్నూల్ 1,257
11 సంగారెడ్డి 1,243
12 మహబూబ్ నగర్ 1,213
13 ఆదిలాబాద్ 1,193
14 సిద్దిపేట 1,178
15 మహబూబాబాద్ 1,172
16 హనుమకొండ 1,157
17 మెదక్ 1,149
18 జగిత్యాల 1,063
19 మంచిర్యాల 1,025
20 యాదాద్రి భువనగిరి 1,010
21 జయశంకర్ భూపాలపల్లి 918
22 నిర్మల్ 876
23 వరంగల్ 842
24 కొమరం భీం ఆసిఫాబాద్ 825
25 పెద్దపల్లి 800
26 జనగాం 760
27 నారాయణపేట్ 741
28 వికారాబాద్ 738
29 సూర్యాపేట 719
30 ములుగు 696
31 జోగులాంబ గద్వాల 662
32 రాజన్న సిరిసిల్ల 601
33 వనపర్తి 556
మొత్తం 39,829