Telangana Jobs : క్యాడర్, జోన్, మల్టీ జోన్లవారీగా పోస్టుల వివరాలు

జోనల్ స్థాయిలో 18,866 ఖాళీలు, మల్టీజోన్ లో 13,170 ఖాళీలు, ఇతర కేటగిరి, వర్సిటీల్లో 8,174 పోస్టులు, గ్రూప్1-503, గ్రూప్ 2-582 పోస్టులు, గ్రూప్3-1373 పోస్టులు, గ్రూప్4-9168 పోస్టులు.

Telangana Jobs : క్యాడర్, జోన్, మల్టీ జోన్లవారీగా పోస్టుల వివరాలు

Jobs Ts

Details of posts in telangana : తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త అందించారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,143 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని శాసనసభలో ప్రకటించారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు.

జిల్లా స్థాయిలో 39, 829 ఉద్యోగ ఖాళీలు, జోనల్ స్థాయిలో 18,866 ఉద్యోగ ఖాళీలు, మల్టీ జోన్ లో 13,170 ఉద్యోగ ఖాళీలు, ఇతర కేటగిరిచ, వర్సిటీల్లో 8,174 పోస్టులు, గ్రూప్1-503, గ్రూప్ 2-582 పోస్టులు, గ్రూప్3 -1373 పోస్టులు, గ్రూప్ 4-9168 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Telangana : రాష్ట్రంలో 91,142 ఉద్యోగ పోస్టులు భర్తీ.. జిల్లాల వారిగా వివరాలు

అలాగే 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పారు. 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్యాడర్, గ్రూపులు, జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రూపులు వారిగా వివరాలు..
గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్‌ 2- 582 ఉద్యోగాలు
గ్రూప్‌ 3 – 1,373 ఉద్యోగాలు
గ్రూప్‌ 4- 9168 పోస్టులు

CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగ పోస్టుల భర్తీ, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్

క్యాడర్ వారీగా వివరాలు…
జిల్లాల్లాలో- 39,829
జోన్లలో- 18,866
మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147

జోన్లు వారిగా వివరాలు..
కాళేశ్వరం జోన్‌లో- 1,630
బాసర జోన్‌- 2,328
రాజన్న జోన్‌- 2,403
భద్రాద్రి జోన్‌- 2,858
యాదాద్రి జోన్‌- 2,160
చార్మినార్ జోన్‌- 5,297
జోగులాంబ జోన్‌- 2,190

CM KCR : తెలంగాణ భాష పెడితే సినిమాలు హిట్ : సీఎం కేసీఆర్

మల్టీజోన్ల వారిగా వివరాలు..
మల్టీజోన్ 1- 6,800
మల్టీజోన్ 2- 6,370