Andhra pradesh : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..YCP తరపున రాజ్యసభకు వెళ్లేదెవరు?

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. మరి YCP తరపున పెద్దలసభకు వెళ్లేదెవరు? జగన్ ఎవరిని ఎంపిక చేస్తారు? ప్రీతి అదానీ,అడ్వకేట్ నిరంజన్ రెడ్డి,నటుడు అలీ,ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

Andhra pradesh : వైసీపీ లీడర్లంతా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఏపీలో 4 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ నాలుగూ.. వైసీపీకే దక్కుతాయి. అయితే.. అధికార పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరన్నదే.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీలోనూ.. కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ.. వారిలో.. అధినేత జగన్ ఎవరికి చాన్స్ ఇస్తారన్నదే.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయ్. విజయసాయిరెడ్డి, సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి పదవీకాలం పూర్తవడంతో.. కొత్త సభ్యుల ఎన్నిక జరగనుంది. అయితే.. కొత్తగా రాబోయే నలుగురు.. వైసీపీ నుంచే ఎన్నిక కానున్నారు. దీంతో.. పార్టీలో తీవ్ర పోటీ ఏర్పడింది. ఇప్పుడు.. ఆ నలుగురు ఎవరన్న దానిమీదే.. పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈసారి కూడా విజయసాయిరెడ్డికి చాన్స్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.

Also read : NZB Politics : నిజామాబాద్ ఎంపీ పాలిటిక్స్..రంగంలోకి దిగిన ఎంపీ కవిత..ఎంపీ అర్వింద్ పై టార్గెట్

కొత్తగా.. ఏపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త.. గౌతమ్ అదానీ భార్య.. ప్రీతి అదానీకి.. రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ.. అంబానీ కోటాలో.. పరిమళ్ నత్వానికి రాజ్యసభ స్థానం ఇచ్చారు జగన్. ఈసారి.. తన పర్సనల్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డికి కూడా రాజ్యసభ ఇవ్వనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాలుగో స్థానం.. ముస్లింలకు గానీ దళిత నేతకు గానీ ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు.. పార్టీలో టాక్ వినిపిస్తోంది. ముస్లింల నుంచి నటుడు అలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కాకపోతే.. ఎమ్మెల్సీగా ఉన్న ఇక్బాల్‌కి చాన్స్ దక్కొచ్చనే చర్చ జరుగుతోంది. ఇక.. ఎస్సీ కోటాలో.. కిల్లి కృపారాణి పేరు వినిపిస్తోంది.

Also read : Chandrababu : కుప్పం..చంద్రబాబుకు టెన్షన్ పుట్టిస్తోందా?అందుకే అక్కడే ఇల్లు కట్టుకుని మరీ పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నారా?

వీరితో పాటు పార్టీలో కీలక నేతలుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కూడా పేర్లు కూడా రాజ్యసభ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి.. తనను రాజ్యసభకు పంపాలని.. గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరి.. ఉన్న నాలుగు స్థానాల్లో.. జగన్.. ఎవరెవరికి అవకాశం కల్పిస్తారన్నదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు