Chandrababu : కుప్పం..చంద్రబాబుకు టెన్షన్ పుట్టిస్తోందా?అందుకే అక్కడే ఇల్లు కట్టుకుని మరీ పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నారా? Kuppam constituency tension to chandrababu..

Chandrababu : కుప్పం..చంద్రబాబుకు టెన్షన్ పుట్టిస్తోందా?అందుకే అక్కడే ఇల్లు కట్టుకుని మరీ పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నారా?

కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా. అక్కడ.. ఆయనకు పోటీ లేదు బిడ్డ. అని.. తెలుగు తమ్ముళ్లు గల్లా ఎగిరేసి మరీ చెబుతుంటారు. 3 దశాబ్దాలకు పైగా.. కుప్పం ప్రజలు బాబును ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో.. ఆశీర్వదిస్తున్నారు. అయితే.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి.. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ వస్తోంది. దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. ఈ మధ్య కుప్పంపై ఫోకస్ పెంచారు. ఇందుకు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే కారణమని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.

Chandrababu : కుప్పం..చంద్రబాబుకు టెన్షన్ పుట్టిస్తోందా?అందుకే అక్కడే ఇల్లు కట్టుకుని మరీ పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నారా?

Chandrababu kuppam : బాబు ల్యాండయ్యాడు.. థియేటర్లలో కాదు.. కుప్పంలో. ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడు కచ్చితంగా కావాలనుకుంటున్న చంద్రబాబు.. సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తగిలిన షాక్‌తో.. ఇప్పటి నుంచే కుప్పంలో సైకిల్‌కు రిపేర్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు.. త్వరలోనే అక్కడ సొంతిల్లు కూడా నిర్మించుకోబోతున్నారట. ఇంతలా.. ఆ ప్రాంతంపై దృష్టి పెట్టడానికి రీజనేంటి? కుప్పం.. బాబులో టెన్షన్ పుట్టిస్తోందా?

కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా. అక్కడ.. ఆయనకు పోటీ లేదు బిడ్డ. అని.. తెలుగు తమ్ముళ్లు గల్లా ఎగిరేసి మరీ చెబుతుంటారు. 3 దశాబ్దాలకు పైగా.. కుప్పం ప్రజలు బాబును ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో.. ఆశీర్వదిస్తున్నారు. అయితే.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి.. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ వస్తోంది. అయినా.. ఇదేమంత పెద్ద విషయం కాదనుకొని.. అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే.. కుప్పం తనదేనని గట్టి నమ్మకంతో ఉండేవారు. కానీ.. ఈ మధ్య కుప్పంపై ఫోకస్ పెంచారు. ఇందుకు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే కారణమని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.

కుప్పం లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో వచ్చి రిజల్ట్‌తోనే.. బాబుకు సీన్ అర్థమైపోయింది. సీరియస్‌గా తీసుకోకపోతే.. తన సీటుకే ఎసరొస్తుందని ఫీలైనట్టున్నారు. పైగా.. మంత్రి పెద్దిరెడ్డి కూడా కుప్పంపై ఫోకస్ చేయడం, సీఎం జగన్ కూడా అప్పుడప్పుడు కుప్పం ప్రస్తావన తీసుకురావడంతో.. ఇక తరచుగా తన నియోజకవర్గంలో పర్యటించాలనే నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ప్రతి 3 నెలలకోసారి వస్తానని.. అక్కడి ప్రజలకు మాటిచ్చారు. ఇప్పుడు అక్కడే పర్యటిస్తున్నారు.

ప్రస్తుతం కుప్పంలో.. పార్టీకి రిపేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు చంద్రబాబు. గ్రౌండ్ లెవెల్ నుంచి మరోసారి తెలుగుదేశం బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఏళ్ల తరబడి కుప్పం టీడీపీలో కొనసాగుతున్న సీనియర్లను నమ్ముకోకుండా.. తానే రంగంలోకి దిగారు. పార్టీ కార్యకర్తలతో.. బాబుగారే నేరుగా మాట్లాడుతున్నారు. మరోవైపు.. కుప్పం వైసీపీ ఇంచార్జిగా ఉన్న భరత్‌ను.. ఈ మధ్యే ఎమ్మెల్సీ పదవి వరించింది. అంతేకాదు.. భరత్ ఇప్పుడు చిత్తూరు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ కూడా. కేవలం.. తనను టార్గెట్ చేసేందుకు.. భరత్‌కు వరుస పదవులు కట్టబెడుతున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం.. ఎత్తుకు పైఎత్తులు వేయడం మీదే బాబు ఫోకస్ పెట్టారు.

ఇక.. కుప్పంలో తాను అనుకున్నంత స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించడం లేదనే ఫీలింగ్‌లో చంద్రబాబు ఉన్నట్లు.. ఆయన సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విద్యుత్ కోతలకు నిరసనగా జనం రోడ్డెక్కినా.. లోకల్ కేడర్ ఈ ఇష్యూను అందిపుచ్చుకోలేదన్న టాక్ ఉంది. పైగా.. అక్కడున్న తెలుగుదేశం నాయకులు నిరసనలతో సరిపెడుతున్నారు తప్ప.. పార్టీ బలోపేతం కోసం పని చేయడం లేదని భావిస్తున్నారు. తానే వచ్చి పరిశీలిస్తే తప్ప.. కుప్పంలో క్వారీ మాఫియా బండారం బయటపడలేదని.. ఈ వ్యవహారాన్ని లోకల్ కేడర్ రాజకీయంగా సరిగ్గా వాడుకోలేదని.. పసుపు దళపతి ఫీలవుతున్నారు. అందుకే.. ఆయనే రంగంలోకి దిగి.. కుప్పం టీడీపీలో కొత్త ఉత్తేజం నింపే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచారు.. అయినా.. అక్కడ చంద్రబాబుకు సొంతిల్లు లేదని.. వైసీపీ నాయకులు విమర్శల డోస్ పెంచారు. వాటన్నింటికి చెక్ పెట్టేందుకు.. కుప్పంలో సొంతిల్లు నిర్మించుకోవాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. ఇందుకోసం.. శాంతిపురం మండలం బైపాస్ రోడ్డులో.. స్థలాన్ని కూడా సెలక్ట్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.. 3 నెలల కిందటి వరకు.. కుప్పంను అంత సీరియస్‌గా తీసుకోని బాబు గారు.. ఇప్పుడు సొంత నియోజకవర్గంపై.. గట్టి ఫోకస్సే పెట్టినట్లు అర్థమవుతోంది.

×