Nizamabad Politics : నిజామాబాద్ ఎంపీ పాలిటిక్స్..రంగంలోకి దిగిన కవిత..ఎంపీ అర్వింద్ పై టార్గెట్

నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పొలిటికల్ జర్నీపై.. మొన్నటి వరకు కొన్ని డౌట్స్ ఉండేవి. మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా.? లేదా? అని. కానీ.. ఇప్పుడవన్నీ పటాపంచలైపోయాయ్. కవిత మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో దిగడం ఖాయమని అర్థమైపోయింది. అయితే.. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఎంపీగా పోటీ చేస్తారా? లేదా? అన్నదే సస్పెన్స్‌గా మారింది.

Nizamabad Politics : నిజామాబాద్ ఎంపీ పాలిటిక్స్..రంగంలోకి దిగిన కవిత..ఎంపీ అర్వింద్ పై టార్గెట్

Nzb Politics

Nizamabad Politics : నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పొలిటికల్ జర్నీపై.. మొన్నటిదాకా కొన్ని డౌట్స్ ఉండేవి. ఆవిడ మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా.? లేదా? అనే అనుమానాలు.. వచ్చే ఎన్నికల్లో.. అసెంబ్లీకి పోటీ చేస్తారట.. అనే ప్రచారాలు సాగాయ్. కానీ.. ఇప్పుడవన్నీ పటాపంచలైపోయాయ్. కవిత మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో దిగడం ఖాయమని అర్థమైపోయింది. అయితే.. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఎంపీగా పోటీ చేస్తారా? లేదా? అన్నదే సస్పెన్స్‌గా మారింది.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో.. అసలు రాజకీయం మొదలైంది. ఇందూరులో.. ఇప్పుడప్పడే ఎన్నికల హడావుడి లేకపోయినా.. హీట్ మాత్రం పెరిగిపోయింది. ఎంపీ ఎన్నికల తర్వాత.. మూడేళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న కవిత.. మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఇక నుంచి తనను లైట్ తీసుకోవద్దనే సిగ్నల్ పంపారు. పసుపు బోర్డు విషయంలో.. ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కార్నర్ చేసేందుకు కవిత ట్రై చేస్తున్నారు. టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయ్. మొన్నటివరకు మీడియా, సోషల్ మీడియాలోనే రచ్చంతా నడిచేది. కానీ.. ఇప్పుడు నాయకులనే నేరుగా అడ్డుకునే పరిస్థితి వచ్చింది.

Also read : Police Suicide: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య

నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని.. బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అర్వింద్.. ఇంకా ఎందుకు తేలేదని.. కవిత ప్రశ్నించడం, ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కడిగిపారేయడం.. జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత డిసెంబర్ నుంచే.. నిజామాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో.. ఎంపీ అర్వింద్ చేపట్టే రాజకీయ యాత్రలు, అధికారిక పర్యటనలను అడ్డుకోవడం ప్రారంభమైంది. రైతులే.. ఎంపీని అడ్డుకుంటున్నారని అధికార పార్టీ నేతలు చెబుతుంటే.. రైతుల ముసుగులో టీఆర్ఎస్ కార్యకర్తలే.. ఆ పని చేస్తున్నారని.. కాషాయం పార్టీ నేతలు అంటున్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ అర్వింద్‌ను.. ప్రతి గ్రామంలో నిలదీయాలని పిలుపునిచ్చారు కవిత. దీంతో.. వేల్పూర్ మండలం కుకునుర్‌లో ఎంపీని అడ్డుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని తెలియడంతో.. టూర్ రద్దైంది. దీంతో.. తన పర్యటనకు రక్షణ కల్పించాలనే డిమాండ్‌తో.. ఎంపీ అర్వింద్ కమిషనర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు. తర్వాత.. ఆర్మూర్ పెర్కిట్‌లో ఎంపీ ఇంటి ఎదుట.. పసుపు కొమ్ములు పారబోసి.. రైతులు నిరసన తెలియజేశారు. ఆ తర్వాత.. ఎంపీ అర్వింద్ అనుచరులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. కవిత ఇంటి ముందు ధర్నాకు దిగారు.

ఇక.. జిల్లాలో కవిత తర్వాత.. ఎంపీ అర్వింద్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే లీడర్ లేరని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి.. జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించింది. అంతే.. జీవన్ రెడ్డి జూలు విదిల్చి.. రాజకీయ యుద్ధ క్షేత్రంలోకి దిగిపోయారు. ఎంపీ అర్వింద్‌ను.. ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. ఆ తర్వాత.. రెండు మండలాల్లో ఎంపీ అర్వింద్ అధికారిక కార్యక్రమాలను.. టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో.. తనకు పోలీస్ శాఖ సహకరించడం లేదని.. ఆరోపించారు. ఆరు నెలల్లో.. రెండు సార్లు ఎంపీ అర్వింద్ పోలీస్ కమిషనరేట్లను టార్గెట్ చేస్తూ.. నిరసనలకు దిగారు. ఈ మధ్యే.. లోకల్ పోలీసులపై నమ్మకం లేదని.. వీఆర్ఎస్ తీసుకున్న కేంద్ర బలగాల్లో పనిచేసిన వారితో.. అత్యాధునిక ఆయుధాలతో సెక్యూరిటీని పెంచుకున్నారు.

Also read : Chandrababu : కుప్పం..చంద్రబాబుకు టెన్షన్ పుట్టిస్తోందా?అందుకే అక్కడే ఇల్లు కట్టుకుని మరీ పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నారా?

ఇక.. నిజామాబాద్‌లో సాగుతున్న మరో ప్రచారమేమిటంటే.. వచ్చే ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్.. ఎంపీగా కాకుండా.. ఆర్మూర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అలర్ట్ అయిపోయారు. జిల్లా అధ్యక్షుడి హాదాలో.. అర్వింద్‌ను టార్గెట్ చేస్తున్నారు. కవిత, జీవన్ రెడ్డి పొలిటికల్ ఎటాక్‌కు సంబంధించి.. ఏం జరగబోతుందోనని..ఇందూరు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.