Women Commission Notices To Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు,10 రోజుల్లో లెక్కలతో సహా వివరణ ఇవ్వాలని ఆదేశం

వాలంటీర్లపై, రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది మహిళ కమిషన్. ఆంధ్రప్రదేశ్ లో యువతుల మిస్సింగ్ పై ఏలూరులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది. మహిళల అదశ్యంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

Women Commission Notices To Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు,10 రోజుల్లో లెక్కలతో సహా వివరణ ఇవ్వాలని ఆదేశం

AP Women Commission Notices To Pawan Kalyan

Women Commission..Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వాలంటీర్లపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది మహిళ కమిషన్. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని..మహిళల అదృశ్యంలో వాలంటీర్లు పాత్ర ఏంటో ఆధారాలు చూపాలని దీనికి సంబంధించి 10 రోజుల్లో లెక్కలతో సహా వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది.

పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసిన అంశంపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ 10టీవీతో మాట్లాడుతు..రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమెంత వివరణ ఇవ్వాలని..కేవలం ఆరోపణ లు చెయ్యడం కాదు ఆధారాలు చూపించాలని అన్నారు. ఇంత పెద్ద ఆరోపణ చేసిన పవన్ సరైన ఆధారాలు బహిర్గతం చెయ్యాలన్నారు.కేంద్రం నిఘా సంస్థల్లో ఎవరు ఈయనకి చెప్పారో చెప్పాలని ..ఆధారాలు లేకుండా మహిళల విషయంలో ఆరోపణలు చేసేస్తానంటే కుదరదన్నారు. పవన్ కళ్యాణ్ తక్షణమే లెక్కలు చూపించాలన్నారు. దానికి సంబంధించి వివరాలు చూపించని పక్షంలో పవన్ కల్యాణ్ మహిళలకు, వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

Pawan Kalyan : ఏపీ 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు- వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు

కాగా ఏపీలో యువతులు భారీ సంఖ్యలో మిస్ అవుతున్నారని దీనిపై సీఎం జగన్ గానీ, పోలీస్ డిపార్ట్ మెంట్ గానీ పట్టించుకోలేదంటూ వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపైనా..వైసీపీ పాలనపైనా పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై పవన్ సంచలన ఆరోపణలు చేస్తు..రాష్ట్రంలో మానవ అక్రమ రవాణ జరుగుతోందని, ఇందుకు కారణం వైసీపీ వాలంటరీ వ్యవస్థ అని, ఇందులో వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ విషయం కేంద్ర నిఘా వర్గాలే తనతో చెప్పాయన్నారు.

రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ అవటానికి వాలంటీర్ వ్యవస్థ పని చేస్తోందనా..ఏఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? వారిలో మహిళలు ఎంతమంది ఉంటున్నారు? ఆ మహిళ్లలకు ఎటువంటి సమస్యలున్నాయి? వారికి ఉన్న సమస్యలను ఆసరాగా చేసుకుని వారిని ట్రాప్ చేసి పక్కా ప్లాన్ ప్రకారం వారిని మిస్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు .దీని కోసం వాలంటీర్ వ్యవస్థ పైనున్నవారికి సమాచారం అందిస్తోందన్నారు. ఒంటరి మహిళలకు ఉన్న సమస్యలను ఆసరాగా చేసుకుని వారిని లోబరుచుకుని వారిని మిస్ చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒంటరి మహిళల సమాచారం రాష్ట్ర ప్రభుత్వం సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తోంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మహిళలు మిస్సింగ్ అవుతున్నారు. కేంద్ర నిఘా వర్గాలు ఈ సమాచారం ఇచ్చాయని ఏలూరులో వారాహి రెండో విడత యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.

Alla Nani : కేంద్ర నిఘా వ్యవస్థ పవన్ చుట్టూ ఉందా?.. పవన్ చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడు

ప్రతి గ్రామంలోను ఇది జరుగుతోందని..పైగా ప్రతీ గ్రామంలోను ఎవరు ఎవరి మనిషి? ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? వారిలో వితంతవులు ఉన్నారా? ఇలా వాలంటీర్లు సమాచారం సేకరించి.. సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఇందులో వైసీపీ పెద్దల హస్తం కూడా ఉంది. ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాలు తనకు తెలిపాయి అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో హీటెక్కిస్తోంది.