Andhra pradesh : పట్టపగలే జింకల మందపై వేటగాళ్లు కాల్పులు..12 మూగజీవాలు బలి

కర్నూలు జిల్లా నారాయణపురంలో పట్టపగలే వేటగాళ్లు రెచ్చిపోయారు.జింకల మందపై తుపాకులతో విరుచుకుపడ్డారు. వేటగాళ్ల తుపాకీ తూటాలకు మందలో 12 జింకలు బలి అయ్యాయి.

Andhra pradesh : పట్టపగలే జింకల మందపై వేటగాళ్లు కాల్పులు..12 మూగజీవాలు బలి

Hunters Killed 12 Deer With Guns In Adoni Mandal

Updated On : March 7, 2022 / 11:14 AM IST

hunters killed 12 deer With guns In Adoni Mandal : ఏపీలోని కర్నూలు జిల్లా నారాయణపురం గ్రామ పొలాల్లో పట్టపగలే వేటగాళ్లు రెచ్చిపోయారు.జింకల మందపై తుపాకులతో విరుచుకుపడ్డారు. వేటగాళ్ల తుపాకీ తూటాలకు మందలో 12 జింకలు బలి అయ్యాయి. వేటగాళ్లు దుండగులు జీప్ లో వచ్చి తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో జింకల మందపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు 12 జింకలు ప్రాణాలు కోల్పోయాయి. దీంతో తమ పంట పండింది అనుకున్న దుర్మార్గులు అత్యంత దారుణంగా తుపాకుల తూటాలకు నేలకొరిగిన జింకల్ని తమ వెంట తెచ్చుకున్న కత్తులతో జింకల తలలు వేరు చేసి, మాంసంతో అక్కడి నుంచి ఉడాయించారు.

Also read : Andharpradesh : ఏపీ అసెంబ్లీలో రచ్చ స్టార్ట్.. టీడీపీ ఆందోళనలు, నినాదాలు

ఆదోని మండలం నారాయణపురం పొలాల్లోని గోర్జి వంక సమీపానికి ఆదివారం (మార్చి 6,2022) ఉదయం కొందరు వేటగాళ్లు జీపులో వచ్చారు. కొద్దిసేపటికే తుపాకులతో జింకలపై తూటాల వర్షం కురిపించారు. దీంతో అక్కడికక్కడే 12 జింకలు నేలకొరిగాయి. ఆ జింకల తలలను కత్తులతో వేరుచేసి అక్కడే పడేశారు. మాంసం జీపులో వేసుకుని గ్రామం మీదుగానే పరారయ్యారు. ఈ దృశ్యాలు చూసిన గ్రామస్థులు పోలీసులకు, అటీవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి జింకల తలలను స్వాధీనం చేసుకున్నారు.

Also read : Ukraine Sumy : క్లైమాక్స్‌‌కు చేరుకున్న ఆపరేషన్ గంగ.. సుమిలో 700 మంది ఇండియన్స్

ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో కర్నూలు జిల్లాలో వన్యప్రాణులకు రక్షణ కరవైంది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేటగాళ్లు ఆదోని,కౌతాళం మండలలో జింకల మాంసం కోసం వేటాడి చంపుతున్నారని రైతులు, వ్యవసాయ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే జింకలపై కాల్పులు జరపటం..అత్యంత పాశవికంగా మూగజీవాల తలలు కత్తులతో ఖండించటంతో మిగిలిన కళేబరాలు అక్కడే పారవేసి పోవటంతో స్థానికంగా జింకల కళేబరాలు తీవ్ర కలకలం రేపాయి.