Heavy Rains : బాబోయ్ మళ్లీ వానలు.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వారం మొత్తం వర్షాలే.. అలర్ట్ జారీ..

Heavy Rains : వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రానున్న ఐదు రోజుల్లో ఏపీలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Heavy Rains : బాబోయ్ మళ్లీ వానలు.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వారం మొత్తం వర్షాలే.. అలర్ట్ జారీ..

Heavy rains

Updated On : October 19, 2025 / 11:53 AM IST

Heavy Rains : ఏపీలో కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత నెలలో రెండు వాయుగుండాలు ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసింది. వారంరోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతుంది. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రానున్న ఐదు రోజుల్లో ఏపీలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇప్పటికే తూర్పు గాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈనెల 21న బంగాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని.. అది కాస్త 23న వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాయుగుండం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల మధ్య తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేస్తుండగా.. దక్షిణ కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

శనివారం ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుంది. బస్టాండ్ సమీపంలో రైల్వేట్రాక్ నీట మునిగింది. వరదనీటిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిక్కుకుపోయింది. దీంతో రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఏపీలోని పలు ప్రాంతాల్లో వచ్చే ఐదురోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా బలపడి 23వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

కోస్తాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అల్పపీడనం వాయుగుండంగా మారిన తరువాత తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ సీజన్లో ఏర్పడే అల్పపీడనాలు తుపానులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో.. 23వ తేదీన ప్రకాశం, వైఎస్ఆర్ కడప, పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో వర్సాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాలతోపాటు.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.