విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం వచ్చేస్తోంది.. చంద్రబాబు ఏమన్నారంటే?
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఇవాళ చంద్రబాబు నాయుడు పర్యటించారు.

అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం కింద గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సాయం పొందేవారు. ఇప్పుడు ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించారు. పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని గతంలో మంత్రి డోలా బాలవీరాంజనేయులు కూడా అన్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఇవాళ చంద్రబాబు నాయుడు పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని తెలిపారు.
Also Read: వామ్మో.. ఇంత పెద్ద నోరు ఉన్న మహిళను మీరెప్పుడైనా చూశారా? ఎంత పెద్దగా ఉందంటే?
ఈ పథకం కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేశామని, అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక 437 మందికి మాత్రమే అవకాశం కల్పించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్సీల ఆదాయం పెంచే దిశగా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు.
అంబేద్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని చంద్రబాబు నాయుడు తెలిపారు. దళితులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని అన్నారు. “నేను మీకు ఆయుధాలు ఇవ్వలేదు.. ఓటుహక్కు ఇచ్చాను” అని అంబేద్కర్ అన్నారని తెలిపారు.
“గత ఐదేళ్లలో ఆనందంగా ఉన్నారా? రాజధానిని శ్మశానం అన్నారు. ఈ రోజు స్వేచ్చావాతావరణంలో మాట్లాడుకుంటున్నాం. 2019నుంచి 2024వరకూ భయంకరమైన వాతావరణం ఉంది. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ చూడలేదు” అని చంద్రబాబు చెప్పారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్ డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్ ని ఫాలో అవ్వండి.. Click Here