వైసీపీ సభ్యులు హజరైనట్లు సంతకాలు ఉన్నాయి కదా? అని చంద్రబాబు ప్రశ్న.. దొంగచాటు సంతకాల ఖర్మ ఏంటో అంటూ స్పీకర్..
ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఇలా దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారిపట్ల నిబంధనలు పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారు.

Ayyanna Patrudu
వైసీపీ సభ్యుల హాజరు విషయం ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. సభలో వైసీపీ సభ్యులు పలు దినాల్లో హాజరైన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. “హజరైనట్లు సభ్యుల సంతకాలు ఉంటే వారిని మీరేమైనా సభలోకి రానివ్వలేదా?” అని స్పీకర్ అయ్యన్నపాత్రుడిను చంద్రబాబు అడిగారు.
Also Read: రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. ఇప్పటికే కసరత్తు..: కేటీఆర్ ప్రకటన
దొంగచాటు సంతకాల ఖర్మ ఏంటో తనకు అర్థం కావట్లేదని స్పీకర్ అన్నారు. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఇలా దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారిపట్ల నిబంధనలు పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారు. అనర్హత ఉండదా? అని సభ్యుల నుంచి వచ్చిన ప్రతిపాదనను కూడా పరిశీలిస్తానని అయ్యన్నపాత్రుడు తెలిపారు.
కాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా వైసీపీ సభ్యులు సభకు హాజరు కావడం లేదని కొంత కాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ అంశంపై మరోసారి సభలో ప్రస్తావనకు రావడం గమనార్హం.
ప్రస్తుతం అసెంబ్లీలో బలాబలాలు
- టీడీపీ 135
- జనసేన 21
- వైసీపీ 11
- బీజేపీ 8