ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

గతంలో ఏపీలో ఉన్న మద్యం విధానం అమలు పరిచేలా కేబినెట్ నిర్ణయం.

Ap Cabinet Key Decisions : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారధి మీడియాకు వివరించారు. టెక్నాలజీ ద్వారా ఈ – కేబినెట్ సమావేశం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలతో పాటు పురపాలక శాఖలో 269 సూపర్ న్యుమరరీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల నిర్వహించాలని మంత్రి వర్గం ఆమోదించిందన్నారు.

రివర్స్ టెండర్ విధానం పక్కన పెట్టి పాత విధానం కొనసాగించాలని కేబినెట్ ఆమోదించిందని వెల్లడించారు. కావాల్సిన వాళ్లకు పనులు కట్టబెట్టేలా రివర్స్ టెండర్ విధానం వైసిపి ప్రభుత్వం అమలు చేసిందని ఆరోపించారు. చాలా సందర్భాల్లో సింగిల్ టెండర్లు మాత్రమే గతంలో వచ్చాయని తెలిపారు. సీవీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల విధానం అమలు చేయాలని నిర్ణయించారు. పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్ట్ పనుల పునరుద్దరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

* విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు వీలుగా కాలువ నిర్మాణం
* సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ లో విస్తృత చర్చ
* తుంగభద్ర ప్రాజెక్టులో మూడు రోజుల వ్యవధిలో గేట్లు అమర్చి నీటిని కాపాడారు.
* ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం
* స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు
* గంజాయి విస్తృతమైంది, మద్యం నాణ్యతను కూడా దెబ్బ తీశారు
* నకిలీ బ్రాండ్ ల కారణంగా 18 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది
* గతంలో ఏపీలో ఉన్న మద్యం విధానం అమలు పరిచేలా కేబినెట్ నిర్ణయం
* ఎక్సైజ్ శాఖ వ్యవస్థీకృతంగా మళ్ళీ పాత విధానం కొనసాగించాలని నిర్ణయం
* 22 ఏ, ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంలో వివాదాలు ఉన్నాయి

* 25,230 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది
* వీటిపై ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించి విచారణ
* సెప్టెంబర్ చివరి నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
* 47 సార్లు ఒకే భూమిని తారుమారు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయి
* వీటిని కట్టడి చేసేలా నివేదిక కోరాం
* ఏపీలో అదనంగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటు. ఈ పోస్ మిషన్ల కొనుగోలుకు 11 కోట్లు వ్యయం
* ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
* ఉచిత ఇసుక విధానం అమలుకు కేబినెట్ ఆమోదం
* ఇసుక మరింత సులభంగా ప్రజలకు లభించేలా మార్గదర్శకాలు విడుదలకు కేబినెట్ ఆమోదం
* ప్రైవేటు పట్టా భూముల్లో తవ్వకాలు, ఇసుకకు చెల్లింపులపై త్వరలో మార్గదర్శకాలు

Also Read : వైసీపీకి షాక్ మీద షాక్..! పార్టీ వీడేందుకు క్యూ కడుతున్న నేతలు..!

* వికసిత ఏపీ 2047 పై కూడా కేబినెట్ లో చర్చ
* అందరి అభివృద్ధి కోసం ఒక విజన్ డాక్యుమెంట్ విడుదలకు నిర్ణయం
* ప్రజల అభిప్రాయం కోసం వారి ముందు విజన్ డాక్యుమెంట్ ఉంచుతాం

 

 

ట్రెండింగ్ వార్తలు