శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన చంద్రబాబు

శ్రీలంకలో ఉగ్రదాడిని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో చర్చిలు, హోటళ్లలో బాంబు దాడులు అత్యంత హేయనీయమైన చర్య. బాంబు పేళుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి దారుణ ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి, బాధితులకు అండగా నిలబడాలి అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం ఉదయం నుంచి హోటల్స్,చర్చిలు టార్గెట్ గా ఐసిస్ ఉగ్రసంస్థ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 207మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.500 మందికి పైగానే గాయపడ్డారు.