Cm Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఆయన ఇవాళ రాత్రి 12 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇదే సమయంలో ఏపీకి కేటాయింపులపైన చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఏపీకి గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న కీలక ప్రాజెక్టులపైన ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు చంద్రబాబు.
ఏపీకి గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ కోరారు. ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రతిపాదనలు అందించనున్నారు.
Also Read : ఇక ఆగేదేలే.. పాలిటిక్స్‌లో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్న జనసేన..
దావోస్ లో పలు కంపెనీల ప్రతినిధులు, అధినేతలతో జరిపిన చర్చలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై ఆయా డిపార్ట్ మెంట్లకు సంబంధించిన మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు తాము ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నాం అనే అంశంపైనా కేంద్రమంత్రులతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి నిధుల కేటాయింపు అంశంపై ఢిల్లీ పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
Also Read : రాచమల్లు తీరుతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడిపోతున్నారా?