PV Sindhu : పీవీ.సింధును సత్కరించిన సీఎం జగన్.. రూ.30 లక్షల నగదు బహుమానం
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధును ఏపీ సీఎం జగన్ ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆమెకు రూ.30 లక్షల నగదు బహుమానం అందించారు.

CM Jagan honors PV Sindhu
CM Jagan honors PV Sindhu : టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధును ఏపీ సీఎం జగన్ ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆమెకు రూ.30 లక్షల నగదు బహుమానం అందించారు. శుక్రవారం సీఎం జగన్ ను పీవీ సింధు కలిశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్, మంత్రులు ఆమెను అభినందించారు. దేవుడి దయంతో సింధు మంచి ప్రతిభ కనబరిచారని సీఎం జగన్ తెలిపారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారుకావాలన్నారు.
ఈ సందర్భంగా పీవీ.సింధు మాట్లాడుతూ సీఎం జగన్ కలిసినట్లు పేర్కొన్నారు. ఒలింపిక్స్ కు వెళ్లే ముందు సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్నానని..మెడల్ తీసుకురావాలని చెప్పారని గుర్తు చేశారు.
ఏపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. నేషనల్స్ గెలిచిన వారికి వైఎస్ఆర్ పురస్కార అవార్డులు ఇస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభిస్తామని చెప్పారు.