సీఎం జగన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు

  • Publish Date - August 3, 2020 / 10:32 AM IST

రాఖీ పౌర్ణమి సందర్భంగా  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్‌ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం అని పేర్కొన్నారు.



కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన అక్కాచెల్లెమ్మలకు శుభాభినందనలు’’ అని ఆయన సోమవారం తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.