AP CM Jagan : ఏపీ సీఎం జగన్ కు కాలి నొప్పి.. ఒంటిమిట్ట పర్యటన రద్దు

ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో సీఎం జగన్ కాలు బెనికింది. సాయంత్రానికి కాలు నొప్పి మరింత పెరిగింది. గతంలో ఇలాగే ఆయన కాలికి గాయమవ్వగా చాలా రోజులపాటు జగన్ ఇబ్బంది పడ్డారు.

AP CM Jagan : ఏపీ సీఎం జగన్ కు కాలి నొప్పి.. ఒంటిమిట్ట పర్యటన రద్దు

AP CM Jagan (1)

Updated On : April 5, 2023 / 9:03 AM IST

AP CM Jagan : ఏపీ సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు అయింది. సీఎం జగన్ కు కాలి నొప్పి కారణంగా బుధవారం వైఎస్సార్ కడప జిల్లా పర్యటన రద్దు అయింది. మంగళవారం(మార్చి4)న ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో సీఎం జగన్ కాలు బెనికింది. సాయంత్రానికి కాలు నొప్పి మరింత పెరిగింది. గతంలో ఇలాగే ఆయన కాలికి గాయమవ్వగా చాలా రోజులపాటు జగన్ ఇబ్బంది పడ్డారు.

తాజాగా మళ్లీ జగన్ కు కాలి నొప్పి కావడంతో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో బుధవారం(ఏప్రిల్ 5)న ఒంటి మిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు. ఏపీ అయోధ్య ఒంటి మిట్ట శ్రీకోదండరామాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముల కల్యాణం జరుగనుంది. సీతారాముల కల్యాణానికి టీటీడీ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Vontimitta : ఒంటిమిట్ట రామాలయం విశేషాలు

టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ ఇప్పటికే ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏక శిలా నగరం ఒంటి మిట్ట కోదండరామాలయంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కల్పించారు.  కోదండ రాముడి కల్యాణాన్ని ఏపీ ప్రభుత్వం అధికారిక వేడుకగా నిర్వహిస్తోంది.

ఒంటి మిట్ట కోదండ రామస్వామి సన్నిధిలో జరిగే సీతారాముల కల్యాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సీతారాముల కల్యాణం భద్రాద్రిలో చైత్ర మాసం నవమి రోజు పగలు జరిగితే.. ఒంటిమిట్టలో చైత్ర పౌర్ణమి రోజున పండు వెన్నెల వెలుగుల్లో జరగడం ప్రత్యేకత. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకంగా భారీగా పెద్ద ఎయిర్ కూలర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

Vontimitta : ఒంటిమిట్ట రామాలయం విశేషాలు

భక్తులు కల్యాణం తిలకించేందుకు ఎల్ ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. కల్యాణ వేదిక ప్రధాన రహదారిలో ఉండటంతో రాజంపేట, తిరుపతి వెళ్లే వాహనాలను రాయచోటి మీదుగా మళ్లించారు. కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి 118 బస్సులను నడుపుతున్నారు.