AP Govt Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ .. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

AP Govt Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ .. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..

AP Group-1 Group-2 posts notifications

Updated On : May 25, 2023 / 4:08 PM IST

AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అతి త్వరలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 1000కి పైగా పోస్టులు ఉండే అవకాశం ఉంది.వీటిలో గ్రూప్ -1లో 100, గ్రూప్-2లో 900కు పైగా ఉద్యోగాలుండే అవకాశమున్నట్లుగా సమాచారం.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..సీఎం జగన్ ఆదేశాలతో పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వంలో వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకుని నోటిషికేషన్ కు జారీకి అవసరమైన ప్రక్రియలను జరుపుతున్నామని తెలిపారు. అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.

గ్రూప్ 1కు సంబంధించి 100 పోస్టులు, గ్రూప్ -2కు సంబంధించి సుమారు 900ల పోస్టులు మొత్తం 100 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి నోటీఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.