Disha Act : ”దిశ” చట్టం గురించి కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం జగన్
ఆంధప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం రూపోందిచిన దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.

Ap Cm Ys Jagan Wrote A Letter
Disha Act : ఆంధప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం రూపోందిచిన దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఈరోజు ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో దిశ ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ” గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను యాక్టివ్‌గా చేయాలి. ఫిర్యాదు చేయడానికి మహిళలు పీఎస్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలి అని ఆదేశించారు. జీరో ఎఫ్‌ఐఆర్ అవకాశానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.
దిశ యాప్‌పై మహిళా పోలీసులకు అవగాహన, శిక్షణ కల్పించాలి. ప్రతి 2 వారాలకోసారి కలెక్టర్, ఎస్పీలు ప్రజా సమస్యలతో పాటు.. మహిళల భద్రతపైనా సమీక్ష నిర్వహించాలి. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దిశ ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రతి పీఎస్‌లో డిస్‌ప్లే ఏర్పాటు చేయాలి” అని తెలిపారు. ఈ సమీక్షలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.