Contract Employees : ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ విధి విధానాలు ఖరారు
2014 జూన్ 2కు ముందు నియామకమై ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు రెగ్యులరైజ్ కానున్నారు. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు అందాయి.

AP Contract Employees Regularization
Contract Employees Regularization : ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ విధి విధానాలు ఖరారు చేసింది. డీఏ పెంచుతూ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ అంశంలోనూ ముందడుగు వేసింది. 10,117 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిన్న (శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇవాళ (శనివారం) విధి విధానాలు జారీ చేసింది. 2014 జూన్ 2కు ముందు నియామకమై ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు రెగ్యులరైజ్ కానున్నారు. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు అందాయి.
ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు దసరా కానుక అందించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ మోదించిన బిల్లుకు గవర్నర్ గెజిట్ జారీ చేశారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రూప్ 2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
గతంలో గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ సంఖ్య పెంచాలని నిరుద్యోగులు కోరారు. దీంతో వారిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఏపీపీఎస్సీ మొత్తం 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.