కర్నూలు : బనగానపల్లి పీఎస్ లో 12మంది పోలీసులకు కరోనా..కుటుంబాలన్నీ క్వారంటైన్ కు

కర్నూలు : బనగానపల్లి పీఎస్ లో 12మంది పోలీసులకు కరోనా..కుటుంబాలన్నీ క్వారంటైన్ కు

Updated On : April 19, 2021 / 1:12 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లాలోని బనగానపల్లి పోలీస్ స్టేషన్ లో 12మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుల్స్,నలుగురు హోంగార్డులకు కరోనా సోకింది. దీంతో వీరిని కర్నూలు, నంద్యాల కోవిడ్ సెంటర్లకు తరలించారు. ఈక్రమంలో కరోనా సోకిన కుటుంబ సభ్యులందరూ హోం క్వారంటైన్ లోనే ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఏమాత్రం కరోనాను కట్టడిచేయకపోతున్న పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో లాక్ డౌన్ లను పొడిగించుకోవటం తప్ప వేరే దారిలేకుండా పోతోంది. దీంతో లాక్ డౌన్ లను కంటిన్యూ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
కాగా..గడిచిన 24 గంటల్లో ఏపీలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14వేల 595కి చేరింది. గత 24 గంటల్లో ఏడుగురు కరోనాతో మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 187కి చేరింది.

నమోదైన మొత్తం కేసుల్లో 7897 కేసులు యాక్టివ్ గా ఉండగా, 6511 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 704 కేసుల్లో 648 కేసులు ఏపీకి చెందినవికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 51 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఐదు మందికి కరోనా సోకింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే, గడిచిన 24 గంటల్లో అనంతపూర్ లో 104, చిత్తూర్ లో 107, తూర్పు గోదావరిలో 55, గుంటూరులో 58, కడపలో 75, కృష్ణా జిల్లాలో 84, కర్నూల్ జిల్లాలో 82, నెల్లూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 31, విశాఖపట్నంలో 26, విజయనగరంలో 13, పశ్చిమగోదావరి జిల్లాలో 7 కొత్త కేసులు నమోదయ్యాయి.

Read:ఏపీలో 14వేలు దాటిన కరోనా కేసులు