AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు, 16 మంది మృతి

  • Published By: sreehari ,Published On : October 29, 2020 / 07:32 PM IST
AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు, 16 మంది మృతి

Updated On : October 29, 2020 / 7:35 PM IST

AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.

ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 88,778 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.



వారిలో కొత్తగా 2,905 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,17,679లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి.

కరోనా బారినపడి 16 మంది మరణించారు. గత 24 గంటల్లో 3243 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.



రాష్ట్రంలో 7,84,752 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 78 లక్షల 62వేల 459 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 26,268 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,659కు చేరుకుంది.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల కృష్ణలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కడపలో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.