Minor Rape : దారుణం.. మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

చక్కగా, బుద్ధిగా స్కూల్ కెళ్లి చదువుకోవాల్సిన వయసు. ఫ్రెండ్స్ తో ఆడుతూ గడపాల్సిన వయసు. క్లాస్ పుస్తకాలతో కాలక్షేపం చేయాల్సిన వయసు.

Minor Rape

AP Crime News Minor Rape : చక్కగా, బుద్ధిగా స్కూల్ కెళ్లి చదువుకోవాల్సిన వయసు. ఫ్రెండ్స్ తో ఆడుతూ గడపాల్సిన వయసు. క్లాస్ పుస్తకాలతో కాలక్షేపం చేయాల్సిన వయసు. అలాంటి వయసులో ఉన్న ఓ మైనర్ బాలుడు దారితప్పాడు. ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం ఉలిక్కిపడేలా ప్రవర్తించాడు. అభంశుభం తెలియని మైనర్ బాలికను రేప్ చేశాడు.

కడప జిల్లా చక్రాయపేటలో దారుణం చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న బాలిక (9)పై అత్యాచారం జరిగింది. బాలికపై అదే గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థి (16) లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్ధానిక పోలీస్ స్టేషన్ లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు.

బాలిక ఇంటి దగ్గర మేక పిల్ల చనిపోయింది. దాన్ని పడేసేందుకు బాలిక ఊరి బయటకు వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలిక అరవకుండా నోటికి గుడ్డ చుట్టాడు. ఆ తర్వాత అత్యాచారం చేశాడు. బాలిక కనిపించకపోయే సరికి కంగారుపడ్డ తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఇంతలో చెట్ల మధ్యలో బాలిక కనిపించింది. బాలికను ఆ దుస్థితిలో చూసి వారు షాక్ తిన్నారు. జరిగిన విషయం తెలుసుకుని విస్తుపోయారు. బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మైనర్ బాలుడు చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది. స్కూల్ కి వెళ్లే వయసులో మైనర్ పిల్లల్లో ఈ విపరీత ప్రవర్తను తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి ఘటనలు ఆడపిల్లల తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. ఒంటరిగా ఆడపిల్లను బయటకు పంపాలంటే టెన్షన్ పడుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిత్యం ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు అడిగినదల్లా కొనిస్తే సరిపోదు. వారు ఏం చేస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఫోన్ లో ఏం చూస్తున్నారు? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇలాంటి వాటి గురించి నిత్యం తెలుసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత జరక్కూడదని జరిగితే ఎంత చింతించినా ప్రయోజనం లేదు.