AP Employees PRC:ప్రభుత్వం ఇచ్చింది పీఆర్సీ కాదు..పే రివర్స్..ఉద్యోగ సంఘాల నాయకులు అక్కా బావా కబుర్లు చెప్తున్నారు

ఉద్యోగ సంఘాల నాయకులు వాట్సాప్ ఉద్యమం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు అక్క బావా కబుర్లు చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

AP Employees PRC:ప్రభుత్వం ఇచ్చింది పీఆర్సీ కాదు..పే రివర్స్..ఉద్యోగ సంఘాల నాయకులు అక్కా బావా కబుర్లు చెప్తున్నారు

Ap Employees Prc

Updated On : January 18, 2022 / 2:56 PM IST

AP Employees PRC : ఉద్యోగ సంఘాల నాయకులు వాట్సాప్ ఉద్యమం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. మంగళవారం (జనవరి 18,2022) అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ..ఉగ్యోగ సంఘాల నాయకులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు అక్క బావా కబుర్లు చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘‘ప్రభుత్వం ఇచ్చింది పీఆర్సీ కాదు..పే రివర్స్’’ అని తాము ముందునుంచి చెబుతునే ఉన్నామని..పీఆర్సీ 23 శాతం ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పినప్పుడే ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు రావాల్సింది అని అన్నారు.

ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని..సంఘాల నాయకులు ఉద్యోగుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం మోసం చేసినట్లు మరే ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఉద్యోగులను మోసం చేయదని అన్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం సీపీఎస్ సాధిస్తామని స్లొగన్స్ ఇచ్చిన నాయకులు ఎక్కడ దాక్కున్నారు? అని ఈ సందర్భంగా అశోక్ బాబు ప్రశ్నించారు.వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగస్తులు అంటే లెక్కలేదంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులు యుద్ధం అయినా చేయాలి లేక పదవులకు రాజీనామా చేయాలని అశోక్ బాబు అన్నారు.

Also read : AP Govt. Vs Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్‌

రీవర్స్ పీఆర్సీ .. జీతాల్లో భారీ కోతలు..!
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇస్తు..ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెచ్‌ఆర్‌ఏలో భారీ కోత విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో ఇటీవల సీఎం జగన్ చర్చించిన అనంతరం జనవరి రెండో వారంలో వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏలో కోత విధించడం భంగపాటు కలిగించింది. సచివాలయం, హెచ్‌వోడీ ఆఫీస్‌ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 30 శాతం నుంచి 16 శాతానికి ప్రభుత్వం కోత విధించింది. గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ, వెలగపూడి సచివాలయ ఉద్యోగులకు మూలవేతనంలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాలకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

జగన్ పాలనలో ప్రజలతో పాటు ఉద్యోగులు దగా పడ్డరని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. జగన్ ప్రభుత్వం ధరల రూపంలో జనాలపై మోయలేని భారాలు మోపుతోందనే విమర్శలు ప్రజలనుంచి వస్తున్నాయి. జగన్ ను నమ్మి గెలిపించిన ఉద్యోగులను కూడా మోసం చేశారని ఉద్యోగులు వాపోతున్నారు. పీఆర్సీ అడిగితే.. హెచ్ఆర్ఏలో కోత విధించరని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు ఉద్యోగులు. ‘రీవర్స్’ పీఆర్సీ ద్వారా ఉద్యోగుల జీతాల్లో భారీ కోత విధించారని విచారం వ్యక్తంచేస్తున్నారు.

Also read :High Court : ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టు విచారణ

కారణం ఏమంటే..గతంలో ఇచ్చిన సీసీఏను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. విజయవాడ, విశాఖలో పని చేసే ఉద్యోగులకు గత టీడీపీ ప్రభుత్వం సీసీఏ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శుల నివేదిక ప్రకారం ప్రభుత్వం నడుచుకోవడం దారుణమని ఏపీ ఉద్యోగసంఘాల అసహనం వ్యక్తం చేస్తున్నాయి. HRA, CCA మరియు 70, 75 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పింఛనుకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు నడుస్తుండగానే.. నేడు ఈ నిర్ణయం రావడం ఉద్యోగుల్లో మరింత ఆందోళన పెంచింది.

గతంలో 70 ఏళ్లు దాటిన వారికీ 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వగా.. పాతశ్లాబ్‌ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. రిటైర్డ్‌ ఉద్యోగులకు 80 ఏళ్ల వయసు దాటాకే అదనపు పెన్షన్‌ ఇవ్వనుంది. 80 ఏళ్లు దాటిన వారికి 20 శాతం, 85 దాటిన తర్వాత 30 శాతం, 90 ఏళ్లు దాటాక 40 శాతం, 95 ఏళ్లు దాటాక 50 శాతం, 100 ఏళ్లు దాటిన తర్వాత 100 శాతం అదనపు పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈనిర్ణయాలపై ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.