AP Govt. Vs Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్‌

ఇటీవల సీఎం జగన్ చర్చించిన అనంతరం జనవరి రెండో వారంలో వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏలో కోత విధించడం భంగపాటు కలిగించింది.

AP Govt. Vs Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్‌

Ap Govt

AP Govt. Vs Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెచ్‌ఆర్‌ఏలో భారీ కోత విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో ఇటీవల సీఎం జగన్ చర్చించిన అనంతరం జనవరి రెండో వారంలో వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏలో కోత విధించడం భంగపాటు కలిగించింది. సచివాలయం, హెచ్‌వోడీ ఆఫీస్‌ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 30 శాతం నుంచి 16 శాతానికి ప్రభుత్వం కోత విధించింది. గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ, వెలగపూడి సచివాలయ ఉద్యోగులకు మూలవేతనంలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాలకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Also read: Dogs Birthday: పెంపుడు కుక్క పుట్టినరోజున 150 మందికి బిర్యానీ దానం దినసరి కూలీ

గతంలో ఇచ్చిన సీసీఏను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. విజయవాడ, విశాఖలో పని చేసే ఉద్యోగులకు గత టీడీపీ ప్రభుత్వం సీసీఏ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శుల నివేదిక ప్రకారం ప్రభుత్వం నడుచుకోవడం దారుణమని ఏపీ ఉద్యోగసంఘాల అసహనం వ్యక్తం చేస్తున్నాయి. HRA, CCA మరియు 70, 75 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పింఛనుకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు నడుస్తుండగానే.. నేడు ఈ నిర్ణయం రావడం ఉద్యోగుల్లో మరింత ఆందోళన పెంచింది.

Also read: Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠా అరెస్ట్

గతంలో 70 ఏళ్లు దాటిన వారికీ 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వగా.. పాతశ్లాబ్‌ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. రిటైర్డ్‌ ఉద్యోగులకు 80 ఏళ్ల వయసు దాటాకే అదనపు పెన్షన్‌ ఇవ్వనుంది. 80 ఏళ్లు దాటిన వారికి 20 శాతం, 85 దాటిన తర్వాత 30 శాతం, 90 ఏళ్లు దాటాక 40 శాతం, 95 ఏళ్లు దాటాక 50 శాతం, 100 ఏళ్లు దాటిన తర్వాత 100 శాతం అదనపు పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈనిర్ణయాలపై ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.

Also read: No lockdown: పరిస్థితి అదుపులోనే ఉంది.. లాక్‌డౌన్ అవసర్లేదు