Telangana High Court: ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టు విచారణ

సీఎస్ సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయడం కుదరకపోతే.. మార్చి 14న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

Telangana High Court: ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టు విచారణ

High Court (1)

Updated On : January 18, 2022 / 3:29 PM IST

Telangana High Court : ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. విశ్రాంత ఉద్యోగి నాగధర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీతాలు ఇస్తున్నారని నాగధర్ సింగ్ పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

Corona Positive : తెలంగాణలో కరోనా విజృంభణ.. బీఆర్‌కే భవన్‌లో ఐఏఎస్‌లు, ఉద్యోగులు.. పోలీసులకు పాజిటివ్

సీఎస్ సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయడం కుదరకపోతే.. మార్చి 14న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. పనిచేయించుకోకుండా జీతాలు ఇస్తే ప్రజాధనం వృథా అయినట్టేనని అభ్యంతరం వ్యక్తం చేసింది.