AP Employees : పీఆర్సీపై పోరుబాట.. ఒకే వేదికపైకి నాలుగు ఉద్యోగ సంఘాలు

విజయవాడలో ఉద్యోగసంఘాల కీలక నేతల సమావేశం ముగిసింది. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించామన్నారు.

Ap Employees

AP Employees unions fight : పీఆర్సీ అంశంపై పోరాటానికి ఏపీ ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఒకే వేదికపైకి రావాలని నాలుగు ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. రేపు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. భేటీ అనంతరం నేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఉమ్మడి పోరాటంతో మెరుగైన పీఆర్సీ సాధించుకుంటామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడలో ఉద్యోగ సంఘాల కీలక నేతల సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు. అన్ని సంఘాలు వారి అసోసియేషన్ మెంబెర్స్ తో మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Interesting Development : ఉయ్యూరు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన పరిణామం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ అంతర్గత విభేదాలు పక్కన పెట్టి ఒక వేదిక మీదకు వచ్చామని తెలిపారు. అందరం కలిసి పోరాడతామన్నారు. రేపటి నుంచి అందరం ఒకే వాదనతో ముందుకెళ్తామని వెల్లడించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా తమ డిమాండ్ లు పరిష్కరించాలని కోరారు. అందరం కలిసి పోరాడితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని సచివాలయ ఉద్యోగుల సంఘం వెంకట్రామి రెడ్డి అన్నారు. ఉద్యోగులకు మేలు జరగడం కోసం కలిసి ముందుకెళ్తామని తెలిపారు.

ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు నిరాకరిస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు జీవో జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం ఈనెల 25వ తేదీలోగా వేతనాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ట్రెజరీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
అయితే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ, డ్రాయింగ్ అధికారులు నిరాకరిస్తున్నారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని, జీతాలు ప్రాసెస్ చేయలేమని తేల్చి చెబుతున్నారు. పీఆర్సీ జీవోలను రద్దు చేసేవరకు పోరాటం ఆపేది లేదని అమరావతి జేఏసీ నాయుకులు ఇప్పటికే స్పష్టం చేశారు.

AP Treasury Employees : ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ.. ‘జీతాలు ప్రాసెస్ చేయలేమ్’

మొత్తం ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీ ఎన్ జీవోలు, అదే విధంగా 16 సంఘాలు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేయడానికి ట్రెజరీ ఉద్యోగులు పూర్తిగా నిరాకరిస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేమని తెల్చే చెప్పారు. ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్నిశాఖలకు చెందిన ఉద్యోగులు పోరుబాటు పట్టారు.

ఇవాళ పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ సెక్రటేరియట్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. లంచ్‌ బ్రేక్‌ టైమ్‌లో ధర్నా చేపట్టారు. మూడవ బ్లాక్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సెక్రటేరియట్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుని.. తమకు న్యాయమైన హెచ్‌ఆర్‌ఏ, సీసీఏలతో కూడిన జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అప్పటి వరకు ఆందోళనలు విరమించబోమంటున్నారు.

AP Corona : ఏపీలో కరోనా కలకలం.. ఒక్కరోజులో 12,615 పాజిటివ్ కేసులు, ఐదుగురు మృతి

మరోవైపు ఏపీలో పీఆర్సీ పంచాయితీ హైకోర్టుకు చేరింది. సర్వీస్‌ బెనిఫిట్స్‌ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్‌ జేఏసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. విభజన చట్ట ప్రకారం ఎలాంటి సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించకూడదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోల్ని రద్దు చేయాలంటూ పిటిషన్‌లో కోరింది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఏపీలో ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుండగానే.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన పే స్కేల్స్‌ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీలకు ఆదేశాలిచ్చింది. ఇక- కొత్త జీతాలు వద్దు.. పాతవే కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.