AP Treasury Employees : ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ.. ‘జీతాలు ప్రాసెస్ చేయలేమ్’

అయితే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ, డ్రాయింగ్ అధికారులు నిరాకరిస్తున్నారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని, జీతాలు ప్రాసెస్ చేయలేమని తేల్చి చెబుతున్నారు.

AP Treasury Employees : ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ.. ‘జీతాలు ప్రాసెస్ చేయలేమ్’

Ap Tresury (1)

AP Treasury employees refusing : ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు నిరాకరిస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు జీవో జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం ఈనెల 25వ తేదీలోగా వేతనాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ట్రెజరీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

అయితే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ, డ్రాయింగ్ అధికారులు నిరాకరిస్తున్నారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని, జీతాలు ప్రాసెస్ చేయలేమని తేల్చి చెబుతున్నారు. పీఆర్సీ జీవోలను రద్దు చేసేవరకు పోరాటం ఆపేది లేదని అమరావతి జేఏసీ నాయుకులు ఇప్పటికే స్పష్టం చేశారు. రేపు సమ్మెకు వెళ్లటానికి సంబంధించి సీఎస్ కు నోటీసు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP Corona : ఏపీలో కరోనా కలకలం.. ఒక్కరోజులో 12,615 పాజిటివ్ కేసులు, ఐదుగురు మృతి

కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగాలు జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. కాగా, పీఆర్సీని రద్దు చేసే వరకు దీంట్లో భాగస్వాములం కాలేమని ట్రెజరీ ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే ట్రెజరీ ఉద్యోగుల సంఘం దీనికి సంబంధించి పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తం ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీ ఎన్ జీవోలు, అదే విధంగా 16 సంఘాలు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేయడానికి ట్రెజరీ ఉద్యోగులు పూర్తిగా నిరాకరిస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేమని తెల్చే చెప్పారు. ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్నిశాఖలకు చెందిన ఉద్యోగులు పోరుబాటు పట్టారు.

Drugs Case : డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలు అరెస్ట్.. సంచలన విషయాలు వెల్లడి

దానికి స్ఫూర్తిగా సంఘీభావంగానే నిలుస్తామని ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ప్రతి నెల 25వ తేదీ లోగా ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయాల్సిన బాధ్యత ట్రెజరీ ఉద్యోగులపైనే ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం ట్రెజరీ శాఖను ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయడానికి నిరాకరించారు.