AP Corona : ఏపీలో కరోనా కలకలం.. ఒక్కరోజులో 12,615 పాజిటివ్ కేసులు, ఐదుగురు మృతి

ఏపీలో ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటితో పోల్చితే ఏపీలో 2 వేలకుపైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 14,527 మంది మరణించారు.

AP Corona : ఏపీలో కరోనా కలకలం.. ఒక్కరోజులో 12,615 పాజిటివ్ కేసులు, ఐదుగురు మృతి

Ap Corona

Updated On : January 20, 2022 / 5:35 PM IST

AP corona positive cases : ఏపీలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 12వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 12,615 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఐదుగురు మృతి చెందారు.

ఏపీలో ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటితో పోల్చితే ఏపీలో 2 వేలకుపైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 14,527 మంది మరణించారు. కరోనా బారిన పడి విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Drugs Case : డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలు అరెస్ట్.. సంచలన విషయాలు వెల్లడి

చిత్తూరు, విశాఖ జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,338, విశాఖ జిల్లాలో కొత్తగా 2,117 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి.