Caveat Petition : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్, ఎందుకీ పిటిషన్?

తన అరెస్ట్ చెల్లదని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం సైతం..Caveat Petition

Caveat Petition : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్, ఎందుకీ పిటిషన్?

AP Goverment Caveat Petition

Caveat Petition – AP Govt : చంద్రబాబు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు వినాలంటూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

తన అరెస్ట్ చెల్లదని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు చంద్రబాబు. అయితే, సుప్రీంకోర్టు కంప్యూటర్ జనరేటడ్ లిస్ట్ లో అక్టోబర్ 6వ తేదీన విచారణ జరగనుంది అని ఉంది. కానీ, నిన్న విచారణ సమయంలో అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ తెలిపారు. దీంతో విచారణ 3న జరుగుతుందా? లేక 6న ఉంటుందా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Also Read: ఈసారి 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయం అంటున్న జగన్ ధీమాకు కారణం ఏంటి?

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కు సంబంధించి సుప్రీంకోర్టులో వాడీవేడిగా విచారణ జరగబోతోంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంపైన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు చంద్రబాబు. తన అరెస్ట్ చెల్లదని, అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17-ఏ ని పరిగణలోకి తీసుకోకుండా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారని, ఈ కేసులో దర్యాఫ్తు కానీ ఎఫ్ఐఆర్ కానీ చెల్లదు అని, దానిపై స్టే విధించాలని చంద్రబాబు తన పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే, ఇదే కేసుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కేసులో ఏవైనా ఉత్తర్వులు ఇచ్చే ముందు మా వాదన కూడా వినాలి అని ఈ కేవియట్ పిటిషన్ లో ప్రస్తావించింది జగన్ సర్కార్. దీంతో పోటాపోటీగా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు సుప్రీంకోర్టులో జరగబోతున్నాయి.

అయితే, సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3వ తేదీ జరుగుతుందా? లేక 6వ తేదీన జరుగుతుందా? అన్న సస్పెన్స్ కూడా కొనసాగుతోంది. ఎందుకంటే కంప్యూటర్ జనరేటడ్ లిస్టులో ఈ కేసు 6వ తేదీ లిస్ట్ అయినట్లుగా ఉంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు రాత్రి పెట్టే లిస్ట్ లో చంద్రబాబు కేసు ఎప్పుడు లిస్ట్ అవుతుంది అనేదానిపై పూర్తి సమాచారం రానుంది. 3వ తేదీ ముందు రోజు రాత్రి ఈ లిస్ట్ ను అప్ లోడ్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు కేసు 3వ తేదీన విచారణక వస్తుందా? లేక 6వ తేదీన విచారణకు వస్తుందా? అన్నదానిపై క్లారిటీ వస్తుంది.

Also Read: టీడీపీ-జనసేన పొత్తు.. టెన్షన్ పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కారణం ఏంటంటే..

అలాగే చంద్రబాబు కేసును సీజేఐ బెంచ్ ముందు కాదు వేరే బెంచ్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందు కాకుండా వేరే బెంచ్ ముందు లిస్ట్ చేయాలి అన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సీజేఐ ధర్మాసనం ముందు కాకుండా వేరే ధర్మాసనం ముందుకు వస్తుందా ఈ కేసు అన్న ఉత్కంఠ కలిగిస్తోంది.

ఇప్పటికే సీజేఐ ధర్మాసనం ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ లూథ్రా ఈ కేసు అంశాన్ని ప్రస్తావించినప్పుడు పలు కీలక విషయాలను మెన్షన్ చేశారు. సెక్షన్ 17-ఎని పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారు. జెడ్ ప్లస్, ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ట్రీట్ చేసే విధానం ఇదేనా? చంద్రబాబుకి రిలీఫ్ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.