Dasara Holidays: విద్యార్థులకు పండగే.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అంటే..
ప్రతి ఏటా దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది.

Dasara Holidays: దసరా పండగ వచ్చేస్తోంది. సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి పెద్ద పండగ ఇదే. ఎప్పుడెప్పుడు దసరా వస్తుందా, ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా అని స్కూల్ విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. వారే కాదు ఉద్యోగులు సైతం వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి పండగ లాంటి వార్త వచ్చేసింది. పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించేసింది.
దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.
ప్రతి ఏటా దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది. విద్యార్థులకే కాదు టీచర్లకు సైతం ఈ సెలవుల్లో కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోతారు. ఏడాదిలో వేసవి సెలవులు తర్వాత అంత పెద్ద మొత్తంలో సెలవులు దసరా పండగ సమయలో విద్యార్థులకు దొరుకుతాయి.
ఎప్పటిలాగే ఈసారి కూడా దసరాకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే.. టూర్ ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు. ఏపీలో అమ్మవారి ఆలయాల్లో ఈ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తెలంగాణలో అంతే ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు.