AP Exams Postponed 2026: ఏపీ ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. మార్చి 21 నాటి పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
AP Exams Postponed 2026 : ఏపీ పది, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. మార్చి 21 శనివారం నిర్వహించబోయే పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
AP Government postponed tenth and inter exams on march 21 due to ramzan holiday and announce new dates also
AP Exams Postponed 2026 : ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు కీలక అలర్ట్… రేపు (మార్చి 21 శనివారం) జరగబోయే పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో రంజాన్ పండగ సెలవును మార్చి 21న ప్రకటించారు. దీంతో ఈ రోజు నిర్వహించాల్సి ఉన్న పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కొత్త తేదీలను కూడా ప్రకటించారు.
మార్చి 21 శనివారం ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1 ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉండే. అయితే మార్చి 21 రంజాన్ సెలవు నేపథ్యంలో ఈ పరీక్షలను మార్చి 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అలానే పదో తరగతి పరీక్షలకు సంబంధించి మార్చి 21 శనివారం థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్షను కూడా వాయిదా వేశారు. దీన్ని ఏప్రిల్ 2వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని తెలిపారు. మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల మార్చి 16న ప్రారంభమయ్యాయి. అలాగే ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభం కాగా మార్చి 24 వరకూ జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో రెండు పరీక్షల ఫలితాలు వెలువడుతాయి.
