AP Free Smartphones : వారికి AP ప్రభుత్వం శుభవార్త.. ఉచితంగా రూ. 15,000 స్మార్ట్ ఫోన్.. రూ.10 లక్షల వరకు
AP Free Smartphones : ఏపీ ప్రభుత్వం వారందరికీ శుభవార్త చెప్పింది. రూ.15 వేల విలువైన స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది.
ap government provide free smartphones to 28500 Village Organisation Assistants VOAs
- ఏపీలో వీఓఏలకు శుభవార్త
- రూ.15 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ఫ్రీ
- పంపిణీ చేసిన ప్రభుత్వం
AP Free Smartphones : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గ్రామ సంఘ సహాయకులకు (వీఓఏ) రూ. 15 వేల ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్ను ఉచితంగా ఇచ్చింది. ఏపీలో ఉన్న 28,500 మంది వీఓఏలకు ఈ స్మార్ట్ ఫోన్లను అందించింది. ఈ క్రమంలో తాజాగా విజయవాడలోని రామవరప్పాడు ఎం కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్.. వీఓఏలకు ఉచిత స్మార్ట్ ఫోన్లను అందజేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను అర్హులందరికీ అందించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి తెలిపారు. వీఓఏలు.. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం వారందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వీఓఏలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించే అంశాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వీఓఏలు గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని.. వారి సేవలను మరింత మెరుగుపరిచేందుకు గాను.. తమ ప్రభుత్వం వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిందన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ ఏర్పాటు చేయబోతుందని మంత్రి శ్రీనివాస్ ప్రకటించారు. అలాగే డ్వాక్రా సంఘాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని వీఓఏలు ఎప్పటి నుంచో ఉచిత స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి కోరిక నెరవేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
