AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ సచివాలయాల్లో ఆర్టీఐ వ్యవస్థ ఏర్పాటు

ప్రతి గ్రామ సచివాలయంలో సమాచార హక్కు సంబంధిత సహాయ అధికారి(అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ - పీఐవో)లను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ సచివాలయాల్లో ఆర్టీఐ వ్యవస్థ ఏర్పాటు

AP Government (2)

Updated On : August 10, 2023 / 9:07 AM IST

AP Government Establish RTI : గ్రామ సచివాలయాలపై ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల్లో ఆర్టీఐ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో సమాచార రాష్ట్ర హక్కు చట్టం అధికారుల నియామకానికి చర్యలు చేపట్టాలంటూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ రాజశేఖర్ జీవో నంబరు 437 జారీ చేశారు.

ప్రతి గ్రామ సచివాలయంలో సమాచార హక్కు సంబంధిత సహాయ అధికారి(అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ – పీఐవో)లను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ సచివాలయంలో పని చేసే డిజిటల్ అసిస్టెంట్ ఏపీఐవోగానూ, పంచాయతీ కార్యదర్శి పీఐవోగానూ కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

AP Govt : విద్యుత్‌ ఉద్యోగులతో చర్చలు సఫలం.. పీఆర్సీకి ప్రభుత్వం అంగీకారం

సచివాలయ స్థాయిలో పరిష్కారం కాని వినతులపై ఫిర్యాదుల కోసం అప్పిలేట్ అథారిటీగా మండల ఎంపీడీవో పని చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.