Chandrababu : ఇసుక పాలసీ.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టు విచారణ

సామాన్యులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయంగానే చూడాలని కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేందుకు ఏముంటుందని తెలిపారు.

Chandrababu : ఇసుక పాలసీ.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టు విచారణ

Chandrababu anticipatory bail

Updated On : November 22, 2023 / 3:01 PM IST

Chandrababu Anticipatory Bail : ఇసుక పాలసీ అంశంలో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్ణయాన్ని క్రిమినల్ కేసు ద్వారా విచారణ జరపకూడదని చంద్రబాబు తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇసుక ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఖజానాకు నష్టం జరిగింది అనడానికి వీల్లేదని, అది ప్రభుత్వ నిర్ణయమని ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు.

సామాన్యులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయంగానే చూడాలని కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేందుకు ఏముంటుందని తెలిపారు. ఉచిత ఇసుక అనేది ఏవిధంగానూ చట్ట విరుద్ధం కాదని చంద్రబాబు తరపు న్యాయవాది అన్నారు.

Also Read: తొమ్మిదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు.. కేసీఆర్ పై రణదీప్ సింగ్ ఆగ్రహం

ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేదలకు, భవన నిర్మాణ పనులకు అందుబాటులో ఉండేలా అప్పటి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని విధాన పరమైన నిర్ణయం తీసుకుందని కోర్టుకు చంద్రబాబు తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో సీఐడీ వాదనల కోసం హైకోర్టు మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది.