Randeep Surjewala : తొమ్మిదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు.. కేసీఆర్ పై రణదీప్ సింగ్ ఆగ్రహం
తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇంకా అమలు కాలేదన్నారు.

Randeep Singh Surjewala
Randeep Surjewala – KCR : తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జెవాల విమర్శలు చేశారు. తొమ్మిదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్ ప్రాజెక్టు తీసుకురాలేకపోవడం వల్ల ఉద్యోగాలు లేవన్నారు. రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు పెరిగిపోయాయని వాపోయారు. ఉద్యోగం రాదేమోనని ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ నిరుద్యోగుల కళ చెదరగొట్టారని పేర్కొన్నారు. నిరుద్యోగ రేటు 15 శాతం ఉందన్నారు. తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇంకా అమలు కాలేదన్నారు. మరోసారి ఉద్యోగం అంటూ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. బీజేపీ రోహిత్ వేములను, బీఆర్ఎస్ ప్రవళికను చంపిందన్నారు.
Shanampudi Saidireddy : ఉత్తమ్ కు ఓడిపోతాననే భయం పట్టుకుంది : ఎమ్మెల్యే సైదిరెడ్డి
కేసీఆర్ ప్రభుత్వం అవీనితిలో కురుకుపోయిందని ఆరోపించారు. ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ లు లేక రాష్ట్ర వ్యాపితంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎవరరూ అధైర్య పడొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా గ్యారెంటీ పథకంతోపాటు 2లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్, మెగా డీఎస్సీ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.