AP Tenth Exams : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందన్నారాయన. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో

AP Tenth, Inter Exams : రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందన్నారాయన. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో సీఎం జగన్ సూచనల మేరకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.

పరీక్షల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు ఇప్పటికే షెడ్యూల్ సిద్ధం చేశామని స్పష్టం చేశారాయన. అయితే, రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వమని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేస్తూ, ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మే ఒకటి నుంచి 19 వరకు జరగాల్సిన ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా వాయిదా వేసింది ప్రభుత్వం.

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ఎలాంటి పరీక్షలు రాయకుండానే సెకండియర్‌కు ప్రమోట్ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో ఏపీలోనూ పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎగ్జామ్స్ రద్దు చేయాలని పేరెంట్స్ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఐసీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు సీఐఎస్ సీఈ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు