పవన్.. జగన్ ను చూసి సంస్కారం నేర్చుకోండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ డ్రామాలు ప్రజలకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ హిస్టీరియా వచ్చినట్లు ఊగిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దత్తపుత్రడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తామన్న వాళ్ళు ఐదేళ్లుగా ఎన్నిసార్లు ప్రశ్నించారని నిలదీశారు. చంద్రబాబు గురించి మాట్లాడటానికి నోరెందుకు రావడం లేదని ప్రశ్నించారు.
అచ్చెన్నాయుడు ఇసుక దోపిడీ పవన్ కు తెలియదా అని అడిగారు. అక్రమ కట్టడాలు తొలగిస్తే పవన్ కు బాధ ఎందుకని ప్రశ్నించారు. సినిమా డైలాగ్ లకు ఓట్లు పడవని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ ను చూసి పవన్ కళ్యాణ్ సంస్కారం నేర్చుకోవాలన్నారు. తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన చిరంజీవిని మర్చిపోనని చెప్పారు.