Bandi
Bandi Srinivasa Rao : పీఆర్సీ అంటే వేతనాలు పెరగాలి.. ఎక్కడైనా తగ్గుతాయా ? సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువగానే ఉంటుందన్నారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు. జరుగుతున్నయుద్ధంలో ఉద్యోగులంతా ప్రత్యక్షంగా పాల్గొనాలని.. సమస్యలు పరిష్కరించే బుద్ధి ప్రభుత్వానికి ప్రసాదించాలని అంబేద్కర్ ను కోరడం జరిగిందన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ చిచ్చు రేపింది. కొత్తగా తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read More : Telangana : కష్టపడి ఎదిగాం.. ఎదగొద్దా ? చిన్న కులం కావొచ్చు.. గొప్పగా బతుకొద్దా?
అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో…2022, జనవరి 26వ తేదీ బుధవారం బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం ప్రభుత్వ బాధ్యత అని, బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయని ప్రభుత్వం అంటోందని తెలిపారు. తమకిచ్చే డబ్బులు కూడా మా పిల్లల తిండికే సరిపోతున్నాయి. . మా పిల్లలను చదివించుకోవాల్సిన అవసరం మాకు లేదా అని నిలదీశారు.
Read More : Film Director Nattikumar : రాజకీయాల్లోకి వస్తున్నా.. జగన్ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీ చేస్తా
ఇప్పటికే చాలా ఒపిక పట్టాం.. ఇంకా ఆగితే తమకు బడితె పూజ చేసేలా పరిస్థితి ఉందన్నారు. ఉద్యోగుల అలవెన్సులు తగ్గించి జీతాల్లో కోత పెట్టారు.. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులు దిద్దుకోవాలని సూచించారు. తాము ఇంతవరకు ఒక్కసారే ఆర్థికశాఖ మంత్రి బుగ్గన మొహం చూశామని, తమ కడుపు మంటను ఇప్పటికైనా మంత్రి అర్థం చేసుకోవాలన్నారు. ఇన్నేళ్ల తన సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు బండి శ్రీనివాసరావు.