Telangana : కష్టపడి ఎదిగాం.. ఎదగొద్దా ? చిన్న కులం కావొచ్చు.. గొప్పగా బతుకొద్దా?

నామినేషన్ తర్వాత మార్చడం సాధ్యమా ? అని సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా ఎదురుకోలేని కొంతమంది తనపై కుట్రలు చేస్తున్నారని చెప్పిన ఆయన కుట్ర చేస్తున్న పేర్లను త్వరలోనే ఆధారాలతో...

Telangana : కష్టపడి ఎదిగాం.. ఎదగొద్దా ? చిన్న కులం కావొచ్చు.. గొప్పగా బతుకొద్దా?

Srinivas Goud

Minister Srinivas Goud Tampering : చిన్న స్థాయి నుంచి కష్టపడి ఎదిగాం ఎదుగొద్దా ? రెండు కార్లు ఉంటాయి.. 20 కార్లు ఉంటాయి ఉండొద్దా ? తమది చిన్న కులం కావొచ్చు అంత మాత్రాన గొప్పగా బతుకొద్దా ? అంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికల అఫిడవిట్ లో టాంపరింగ్ వివాదంపై ఆయన వివరణనిచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎన్నికల టైం నుంచే తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఢిల్లీ కోర్టులో కేసు వేయడం..ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. నామినేషన్ తర్వాత మార్చడం సాధ్యమా ? అని సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా ఎదురుకోలేని కొంతమంది తనపై కుట్రలు చేస్తున్నారని చెప్పిన ఆయన కుట్ర చేస్తున్న పేర్లను త్వరలోనే ఆధారాలతో బయటపెడుతామన్నారు. తన వివరణ అడగకుండా అబద్ధాలు ప్రసారాలు చేశారని, ఒక వ్యక్తి ఎదగడానికి ఎన్నో కష్టాలు ఉంటాయన్నారు.

Read More : Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. దేశంలో నెండర్ వన్ అతనే!

ఆరోపణలు చేయడం చాలా సులువు.. ఇలాంటి ప్రచారం చేస్తే తనకు మరింత మెజారిటీ పెరుగుతుందన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేస్తారని, కార్లకు చలాన్ కట్టలేదనేది కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి కదా, ఇక్కడ కోర్టులో ఫలితాలు వాళ్లకు వ్యతిరేకంగా వచ్చాయన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు, ఢిల్లీ హై కోర్టులో కేసులు వేశారని తెలిపారు. అయితే.. ఢిల్లీ హైకోర్టులో కేసును న్యాయస్థానం డిస్మిస్ చేసిందనే విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.

Read More : Standup Comedy : స్టాండప్ కామెడీ కాంటెస్ట్.. క్యాష్ ప్రైజ్‌తో పాటు.. కామెడీ సిరీస్‌లలో నటించే అవకాశం

విసుగువచ్చి ఒక మీడియా సంస్థకు నోటీసులు ఇచ్చినట్లు, కనీస ఆధారాలు లేని వ్యక్తులు చెప్పే విషయాలను ప్రచారం, కథనాలు రాయొద్దని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎంపీ తనపై కుట్ర చేశారని ఆరోపించారు. కులం అనే ప్రతిపాదితపై రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారని, ఉద్యమ సమయంలో అనేక కేసులు పెట్టారని.. వ్యక్తిగత ఆరోపణలు చేస్తే భయపడమన్నారు. కచ్చితంగా లీగల్ గా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.