రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మీ కార్డులో తప్పులున్నాయా.. ఈ డెడ్ లైన్ లోపు సరిచేసుకోండి.. లేకపోతే..

పాత రేషన్‌ కార్డులకు బదులుగా ఏపీ సర్కారు స్మార్ట్‌ కార్డులను అందిస్తోంది. ఈ కార్డులు ఏటీఎం కార్డుల్లా క్యూఆర్‌ కోడ్‌తో ఉన్నాయి.

AP Ration Cards: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అధిక శాతం కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందాయి.

వీటిలో కొన్ని తప్పులు రావడంతో ఆయా కుటుంబాలు సవరణ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఏపీ సర్కారు సూచించింది. ఇందుకోసం అక్టోబర్ 30 చివరి తేదీ. ఆలోపు మీ స్మార్ట్‌కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలి.

ఈ విషయంపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలు తెలిపారు. లబ్ధిదారులు సంబంధిత సచివాలయాల్లోకి వెళ్లాలని, అక్కడ ఫిర్యాదు చేయవచ్చన్నారు. (AP Ration Cards)

మిగిలిన 20 శాతం మందికి స్మార్ట్‌ కార్డుల పంపిణీ త్వరలోనే జరుగుతుంది. 9 జిల్లాల్లో సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు.

Weather Updates: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుమ్మేయనున్న భారీ వర్షాలు

ఏపీలో అనేక ప్రాంతాల్లో లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. లబ్ధిదారుల కుటుంబాల్లో కొందరి పేర్లు, ఇంటి నెంబర్లు, ఇతర వివరాలు తప్పుగా రావడంతో ఏపీ సర్కారు సవరణల కోసం అవకాశం ఇస్తోంది.

పాత రేషన్‌ కార్డులకు బదులుగా ఏపీ సర్కారు స్మార్ట్‌ కార్డులను అందిస్తోంది. ఈ కార్డులు ఏటీఎం కార్డుల్లా క్యూఆర్‌ కోడ్‌తో ఉన్నాయి. కార్డుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉంటుంది. అలాగే, లబ్ధిదారుడి ఫొటో, రేషన్ దుకాణం నంబరు ఉంటాయి. మరోవైపు కుటుంబ సభ్యుల వివరాలను ముద్రించారు.