AP State Government : కోవిడ్ కట్టడికి రూ. 1000 కోట్లు

ఏపీలో కరోనా కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ భారీగా నిధులు కేటయించింది. 2021, మే 20వ తేదీ గురువారం ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

AP State Government : కోవిడ్ కట్టడికి రూ. 1000 కోట్లు

Covid 19 ap

Updated On : May 20, 2021 / 1:13 PM IST

Covid-19 Pandemic : ఏపీలో కరోనా కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ భారీగా నిధులు కేటయించింది. 2021, మే 20వ తేదీ గురువారం ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం..ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు శాఖలకు నిధులు కేటాయించారు. ఆరోగ్య రంగానికి ఆరోగ్య రంగానికి 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం.

ప్రధానంగా కోవిడ్ పోరాటానికి రూ.1000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా వెల్లడించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

Read More : Andhra Pradesh : ఏపీ బడ్జెట్ 2021-22, ఎవరెవరికి ఎంతెంత?