Couples Suicide : కరోనా సోకిందని దంపతులు ఆత్మహత్య..అనాథలైన పిల్లలు

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కరోనా వచ్చిందని చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అటువంటి విషాద ఘటన ఏపీ కృష్టా జిల్లాలోని పెడనులో చోటుచేసుకుంది. కరోనా సోకిందని ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి పిల్లలు దిక్కులేనివారయ్యారు.

Couples Suicide : కరోనా సోకిందని దంపతులు ఆత్మహత్య..అనాథలైన పిల్లలు

Wife And Husband Infected Corona..commit Suicide

Updated On : May 21, 2021 / 12:31 PM IST

ap wife and husband infected corona commit suicide: కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కరోనా వచ్చిందని చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అటువంటి విషాద ఘటన ఏపీ కృష్టా జిల్లాలోని పెడనులో చోటుచేసుకుంది. కరోనా సోకిందని ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు.

పెడనకు చెందిన ప్రసాద్, భారతి దంపతులకు పది రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. దీంతో వారు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. కానీ వారికి కరోనా తగ్గుతుందో లేదో..అది తమ పిల్లలకు కూడా సోకుతుందేమోననే భయంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఆ భయం అలా పెరిగి పెరిగీ ఆత్మహత్యకు దారి తీసింది. తీవ్ర మనస్తాపానికి గురైన భార్యాభర్తలు ఇంట్లోనే ఉరి వేసుకుని మరణించారు. దాంతో ఈ విషాద ఘటనతో వారి ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు.

కాగా..ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ పెట్టకుండా కర్ఫ్యూను మాత్రం కొనసాగిస్తున్నారు. కానీ కర్ఫ్యూ కూడా కట్టుదిట్టంగా అమలు జరగటంలేదనీ..జనాలు రోడ్లమీద యధేచ్చంగా తిరుగుతూనే ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.